గిల్ బ్యాటింగ్ పై విమర్శలు.. పీటర్సన్ ఏమన్నాడంటే?

praveen
ప్రస్తుతం టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. కాక ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగింది. అయితే నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి ఇంగ్లాండ్ జట్టు భారత టీమ్ ను సొంతగడ్డ మీదే ఓడించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.

 అయితే ఇక ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది టీమ్ ఇండియా. ప్రస్తుతం ఏపీలోని విశాఖ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే మొదటి మ్యాచ్లో చేసిన తప్పులున్న పునరావృతం చేయకుండా అటు టీమిండియా బ్యాటింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తూ ఉంది అని చెప్పాలి. మరి ముఖ్యంగా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ తన ఆట తీరుతో విధ్వంసమే సృష్టిస్తున్నాడు. అయితే ఇక భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న గిల్ మాత్రం ఎక్కడ ఆకట్టుకోలేకపోతున్నాడు.

 మొదటి మ్యాచ్ లో నిరాశపరిచిన గిల్ ఇక రెండో టెస్ట్ మ్యాచ్ లోను అదే ఆట తీరుతో అందరికీ ఆగ్రహం తెప్పించాడు. ఈ క్రమంలోనే అతని ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇలా టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్న గిల్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయ్. అతనికి ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ పీటర్సన్ మద్దతుగా నిలిచాడు. మొదటి పది టెస్టుల్లో సౌత్ ఆఫ్రికా దిగ్గజం జాగ్వస్ కల్లిస్ యావరేజ్ 22 మాత్రమే. ఆ తర్వాత అతను గ్రేటెస్ట్ క్లియర్ గా అవతరించాడు. గిల్ కు కూడా కాస్త సమయం ఇవ్వండి. అతను ఒక సీరియస్ ప్లేయర్ అంటూ ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ గిల్ కు మద్దతుగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: