చరిత్ర సృష్టించిన బుమ్రా.. ఇండియన్ క్రికెట్ లో ఒకే ఒక్కడు?

praveen
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్టు సిరీస్ లో భాగంగా అద్భుతంగా రాణిస్తుంది అనుకున్న టీమిండియాకు మొదటి మ్యాచ్ లోనే చేదు అనుభవం ఎదురైంది. అయితే హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో 28 పరుగులు తేడాతో భారత జట్టు ఓటమిపాలు అయింది. దీంతో టీమిండియా ఆట తీరూపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే మొదటి మ్యాచ్లో భారత బౌలింగ్ విభాగం ఆకట్టుకున్నప్పటికీ బ్యాటింగ్ విభాగం మాత్రం ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది.

 దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం రెండవ టెస్టు మ్యాచ్ అటు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ వేదికగా జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ మ్యాచ్ లో భాగంగా ఇటీవల భారత బౌలర్లు అదరగొట్టేసారూ. మరి ముఖ్యంగా భారత జట్టులో కీలక ఫేసర్ గా కొనసాగుతున్న జస్ ప్రీత్ బుమ్రా  అయితే బుల్లెట్ లాంటి బంతులను విసిరి ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను బెంబేలెత్తించాడు  అని చెప్పాలి. ఇక ఇటీవల జరిగిన మ్యాచ్ లో ఏకంగా ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు బుమ్రా. ఇక అతను సందించిన అద్భుతమైన బంతులకు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది అని చెప్పాలి.

 అయితే వైజాగ్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత ఫేసర్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన చేయడం ద్వారా కొత్త రికార్డును సృష్టించాడు. ఏకంగా ఆరు వికెట్లను పడగొట్టి టెస్టుల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన భారత ఫేస్ బౌలర్ గా నిలిచాడు బుమ్రా. కేవలం 34 మ్యాచ్లలోనే బుమ్రా 150 వికెట్లు పడగొట్టడం గమనార్హం. ఇక బుమ్రా కంటే ముందు అశ్విన్ 29 మ్యాచుల్లో జడేజా 32 మ్యాచ్లో ఈ మైలురాయిని అందుకున్నారు అని చెప్పాలి. అయితే వేగంగా 150 వికెట్లు తీసిన తొలి ఐదుగురు బౌలర్ల లిస్ట్ చూసుకుంటే బుమ్రా ఒక్కడు మాత్రమే ఫేసర్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: