కోహ్లీ లీవ్ తీసుకోవడం వెనక.. అసలు కారణం అదేనట?

praveen
టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఆటతీరితో ప్రపంచవ్యాప్తంగా కూడా క్రికెట్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు విరాట్ కోహ్లీ. ఏకంగా సొంత దేశ క్రికెటర్లను కూడా వదిలేసి విరాట్ కోహ్లీని అభిమానిస్తూ ఉంటారు చాలామంది క్రికెట్ ప్రేక్షకులు. ఒక్కసారైనా కోహ్లీతో ఒక ఫోటో దిగాలని ఆశ పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎంతోమంది లెజెండ్స్ సాధించిన రికార్డులను బద్దలు కొట్టి తన పేరును లికించుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా ఎవరికి సాధించని రీతిలో ఫాలోవర్లని  సంపాదించుకున్నాడు.

 అయితే ఇక సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ దృశ్య అతని గురించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోతోంది. అయితే గత కాలం నుండి కోహ్లీ గురించి ఒక విషయంపై చర్చ జరుగుతూ ఉంది. ఎప్పుడు టీమిండియా కు మూడు ఫార్మట్లలో అందుబాటులో ఉండే విరాట్ కోహ్లీ ఎందుకు గత కొంతకాలం నుంచి ఇక తరచూ సెలవులు తీసుకుంటున్నాడు అనే విషయంపై చర్చ జరుగుతుంది. అయితే కోహ్లీ తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడం కారణంగానే అతను లీవ్ తీసుకున్నాడు అంటూ వార్తలు వచ్చిన.. అదంతా నిజం కాదు అని కోహ్లీ తమ్ముడు  క్లారిటీ ఇచ్చాడు.

 మరి ఇంకెందుకు కోహ్లీ లీవ్ తీసుకున్నాడు అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఇటీవల కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్ దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఈ విషయంపై నోరు జారీ అందరికీ నిజం చెప్పేశాడు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు అంటూ ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. అందుకే విరాట్ కోహ్లీ ప్రస్తుతం వరుసగా సెలవులు తీసుకుంటున్నాడు అంటూ ఏబీడీ క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపాడు ఎబి డివిలియర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: