డబుల్ సెంచరీ.. ఇది 'జైస్ బాల్'.. అంతకుమించి ఉంటుంది మరీ?

praveen
ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ ఆడెందుకు ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ గా కొనసాగుతున్న ఈ రెండు టీమ్స్ మధ్య టెస్ట్ సిరీస్ లో భాగంగా హోరాహోరీ పోరు జరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవలే హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయింది. అయితే రెండో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగింది టీం ఇండియా. విశాఖ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది.

 అయితే గత కొంతకాలం నుంచి సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో బజ్ బాల్ అనే ఎటాకింగ్ గేమ్ తో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతుంది ఇంగ్లాండు జట్టు. ఏకంగా టి20 తరహాలో బ్యాటింగ్ విధ్వంసాన్ని  కొనసాగిస్తూ భారీగా పరుగులు చేస్తూ ఉంది అని చెప్పాలి. ఇక ఇలాంటి ఆట తీరు ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో బజ్ బాల్ ను అటు టీమిండియా ఎలా ఎదుర్కొంటుందో చూడాలని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో.. బజ్ బాల్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు జైస్ బాల్ ని రుచి చూపిస్తున్నాడు. యశస్వి జైస్వాల్. ఇది బజ్ బాల్ కాదు అంతకుమించి అని అర్థమయ్యేలా చేస్తూ ఉన్నాడు.

 తన విధ్వంసకరమైన ఆట తీరుతో చెలరేగిపోతూ ఉన్నాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ లో సీనియర్ ప్లేయర్లు అందరూ విఫలమైన సమయంలో యశస్వి జైష్వాల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఇక ఇప్పుడు విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఒకవైపు వికెట్లు పడుతున్న అతను మాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల రెండో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు ఏడు సిక్సర్ల సహాయంతో ద్విశతకం నమోదు చేశాడు. తొలి సెషన్ ప్రారంభమైన కాసేపటికి అశ్విన్ అవుట్ అవ్వగా.. కుల్దీప్ యాదవ్ తో కలిసి ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్నాడు జైశ్వాల్. దీంతో అతని డబుల్ సెంచరీ తర్వాత ఇది బజ్ బాల్ కాదు జైష్ బాల్ అంతకుమించి అంటూ భారత అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: