రిటైర్మెంట్ ఏజ్ లో వేట.. చరిత్ర సృష్టించిన జేమ్స్ అండర్సన్?

praveen
ఎంత గొప్ప ఆటగాడికి అయినా సరే రిటైర్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఒక వయస్సు వచ్చిన తర్వాత ఇష్టం లేకపోయినా ఇక తమకు ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలకడం లాంటివి చేస్తూ ఉంటారు స్టార్ ప్లేయర్లు. అందుకే ఇలా కెరియర్ కొనసాగినన్ని రోజులు కూడా అద్భుతమైన ఆట తీరును కనబరిచి ఇక ఎన్నో రికార్డులు క్రియేట్ చేయాలని ఆశపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక తమకు ఇష్టమైన ఆటలో ఒక లెజెండ్ గా ఎదిగితే.. తమ జీవితానికి అంతకంటే ఇంకేం వద్దు అని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక ఇలా అత్యుత్తమ ఆట తీరును కనబరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంటారు.

 అయితే ఇలా సాగిపోతున్న కెరియర్లో రిటైర్మెంట్ వయస్సు వచ్చినప్పటికీ ఇంకా అద్భుతమైన ఆట తీరుతో అదరగొడుతూ ఉంటే.. ఇక అతని పేరు తప్పకుండా ఒక్కసారిగా మారుమోగిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇంగ్లాండు స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ గురించి కూడా అందరూ ఇలా  చర్చించుకుంటున్నారు. అందరూ 40 ఏళ్లు కూడా రాకముందే రిటైర్మెంట్ ఆలోచన చేస్తున్నారు. కానీ జేమ్స్ అండర్సన్ 42 ఏళ్లకు చేరువవుతున్న కూడా ఇంకా తన ఆటతో అదరగొడుతూనే ఉన్నాడు. యువ ఆటగాళ్ళకు మించిన ప్రదర్శన చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు.

 ఈ క్రమంలోనే అతనికి వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అనే విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అని చెప్పాలి. కాగా ఇటీవల విశాఖ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా.. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్లో అత్యధిక వయసులో టెస్ట్ మ్యాచ్ ఆడిన ఫాస్ట్ బౌలర్గా ఘనత సాధించాడు. ప్రస్తుతం అండర్సన్ 41 ఏళ్ళ 187 రోజుల వయస్సుతో ఉన్నాడు. తర్వాత స్థానాల్లో అమర్నాథ్ 41ఏళ్ళ 92 రోజులు, రాయి ల్యాండ్ వాల్ 38 ఏళ్ళ 112 రోజులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: