అరంగేట్రంలో అదరగొట్టాడు.. జాక్పాట్ కొట్టేసాడు ?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న క్రీడాభిమానులు అందరూ కూడా ఒక ఆటగాడు గురించి చర్చించుకుంటున్నారు. అతను ఎవరో కాదు వెస్టిండీస్ యంగ్ ప్లేయర్ షమర్ జోసెఫ్. ఇటీవల ఏకంగా వెస్టిండీస్ జట్టుకి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు ఈ యంగ్ ప్లేయర్. ఏకంగా ఇప్పటివరకు ఆస్ట్రేలియా పై గబ్బా స్టేడియంలో ఒక్కసారి కూడా విజయం సాధించలేదు వెస్టిండీస్. అలాంటిది ఇక అతను వెస్టిండీస్ కు అదే స్టేడియంలో విజయాన్ని కట్టబెట్టి ఇక హీరోగా మారిపోయాడు అని చెప్పాలి  ఒకే ఒక్క మ్యాచ్ తో వరల్డ్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు.

 ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు అటు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా.. ఆతిథ్య ఆస్ట్రేలియాతో వరుసగా టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. అయితే ఇప్పుడు వరకు ఎన్నోసార్లు ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్ మధ్య  డబ్బా స్టేడియంలో టెస్ట్ మ్యాచ్లు చాలాసార్లు జరిగాయి. కానీ ఒక్కసారి కూడా అటు ప్రతిష్టాత్మకమైన గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ విజయం సాధించలేదు. కానీ ఇటీవల జరిగిన మ్యాచ్లో ఇక టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన షమర్ జోసెఫ్ తన బౌలింగ్ ఆస్ట్రేలియా నడ్డి విరిచాడు. దీంతో ఇక వెస్టిండీస్ జట్టుకు తొలిసారి ఈ స్టేడియంలో విజయం వరించింది. దీంతో వెస్టిండీస్ క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.

 ఇలా డెబ్యూ మ్యాచ్ లోనే అదిరిపోయే ప్రదర్శన చేసి చరిత్ర సృష్టించిన షమర్ జోసెఫ్ కి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఒక జాక్పాట్ ఆఫర్ ఇచ్చింది అన్నది తెలుస్తుంది. అంతర్జాతీయ కాంట్రాక్టులోకి తీసుకునేందుకు సిద్ధమైందట క్రికెట్ బోర్డు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది అని ఇటీవల వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. కాగా షమర్ జోసెఫ్ పిఎస్ఎల్ కు ఎంపికయ్యాడు. ఇటీవల షఫావర్  జల్మీ జట్టు అతడిని జట్టులోకి చేర్చుకుంది. ఇలా అరంగేట్ర మ్యాచ్ తోనే ఏకంగా వరల్డ్ క్రికెట్లో హీరోగా మారిపోయాడు ఈ యువ ఆటగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: