చరిత్ర సృష్టించిన.. యంగ్ టీమ్ ఇండియా?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా జూన్ నెలలో జరగబోయే టి20 వరల్డ్ కప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందే ఇక క్రికెట్ ప్రేక్షకులందరికీ మరో వరల్డ్ కప్ అలరిస్తుంది. అదే అండర్ 19 వరల్డ్ కప్. ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్న వరుస మ్యాచ్లు ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక వరల్డ్ క్రికెట్ ను ఏలబోయే కుర్రాళ్ళు అందరూ కూడా ఇక ప్రతి మ్యాచ్ లో కూడా కుమ్మేస్తూ ఉన్నారు. ఇక భారత అండర్ 19 జట్టు అయితే ఎంతో అద్భుతమైన ప్రస్థానం కొనసాగిస్తుంది.

 గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా సీనియర్ టీం ఎలా అయితే వరుస విజయాలు సాధిస్తూ ప్రత్యర్థులపై పైచేయి సాధించిందో.. ఇక ఇప్పుడు అండర్ 19 వరల్డ్ కప్ లో కూడా కుర్రాళ్ళు అదే విధంగా దూసుకుపోతూ ఉన్నారు. ప్రతి మ్యాచ్ లో కూడా విజయాన్ని సాధిస్తున్నారు. విజయం అంటే అలాంటి ఇలాంటి విజయం కాదు ఏకంగా ప్రత్యర్ధిపై 200 పరుగుల తేడాతో విక్టరీలు అందుకుంటూ ఉండటం గమనార్హం. ఇలా ఏకంగా అండర్ 19 వరల్డ్ కప్ లో ప్రస్థానం మొదలు పెట్టిన నాటి నుంచి వరుసగా మూడు మ్యాచ్లలో 200 కు పైగా పరుగుల తేడాతో విజయం సాధించింది అండర్ 19 టీమిండియా.

 ఈ క్రమంలోనే ఇటీవల చరిత్ర సృష్టించారు అని చెప్పాలి. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడు విజయాలు సాధించింది యంగ్ టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే మూడింట 200 పరుగుల  తేడాతో గెలుపొందడం విశేషం. దీంతో ఇక భారత కుర్రాళ్ళు చరిత్ర సృష్టించారు. అండర్ 19 టోర్నీ చరిత్రలోనే ఇక ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. ఇంగ్లాండు పై 201, యుఎస్ఏ పై 201, కివీస్ పై 214 పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించింది. డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా మరోసారి వరల్డ్ కప్ టైటిల్ గెలిచేలాగే కనిపిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: