స్టార్ క్రికెటర్ తో.. రెండో పెళ్లికి సిద్ధమైన సానియా మీర్జా?

praveen
భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్స్ సానియా మీర్జా గత కొంతకాలం నుంచి వార్తల్లో హాట్ టాపిక్ మారిపోతుంది. దీనికి కారణం ఆమె ఇటీవల తన భర్త షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకోవడమే. పాకిస్తాన్ క్రికెటర్ అయినా షోయబ్ మాలిక్ ను ప్రేమించింది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమైంది. అయితే ఇలా ఆమె షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక ఎంతలా ట్రోలింగ్ ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇలాంటి ట్రోలింగ్ ను పట్టించుకోని సానియా మీర్జా తన ప్రేమను గెలిపించుకోవడానికి షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకుంది.

 అయితే పెళ్లయిన తర్వాత కొన్నాళ్లపాటు వీరి జీవితం సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి అని చెప్పాలి. దీంతో ఇక సానియా మీర్జా షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత కొంతకాలం నుంచి ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇక వీరిద్దరూ విడాకులు వార్తల పై స్పందించలేదు. కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వేరువేరుగా అటెండ్ అవుతూ ఉండడంతో ఈ వార్తలు నిజమే అని అనుకున్నారు అందరూ. అయితే ఇక ఇటీవల సానియా మీర్జా విడాకుల అంశంపై ఓపెన్ అయింది. షోయబ్ మాలిక్ తో విడాకుల వార్త నిజమే అంటూ తెలిపింది.

 అయితే షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటిని మూడో వివాహం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే  అయితే ఇక ఇప్పుడు సానియాకు సంబంధించి మరో వార్త వైరల్ గా మారిపోయింది. రెండో పెళ్లి చేసుకునేందుకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సిద్ధమైందట. ఏకంగా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమ్మీతో సానియా మీర్జా నిశ్చితార్థం జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక కొత్త రూమర్ తేరా మీదికి వచ్చింది. అయితే షమీకి ఇప్పటికే పెళ్లయింది. ఇక డివర్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు షమీ సానియా మీర్జాను పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: