విశాఖలో మ్యాచ్.. ఎంతో గర్వంగా ఉందంటున్న కెఎస్ భరత్?

praveen
ఇండియాలో క్రికెట్ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎన్నో రకాల ఆటలు ఉన్నప్పటికీ ఎందుకో క్రికెట్ ను మాత్రమే అటు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు క్రీడాభిమానులు. ఇక క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇంకొంతమంది కాస్త ఖర్చయినా పర్వాలేదు క్రికెట్ మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూడాలని ఆశ పడుతూ ఉంటారు. అయితే ఇక టీమ్ ఇండియా జట్టులోని స్టార్ ప్లేయర్లను ఏకంగా దేవుళ్ళ లాగా ఆరాధిస్తూ ఉంటారు చాలామంది క్రికెట్ అభిమానులు.

 అయితే ఇలా ఇండియాలో క్రికెట్ కి ఈ రేంజ్ లో క్రేజీ ఉంది. కాబట్టి ఎంతో మంది కుర్రాళ్ళు క్రికెట్ నే ఫ్యాషన్ గా మార్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. అయితే దేశవాళి క్రికెట్లో అదరగొట్టి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయాలని అనుకుంటారు. ఇక ఇలా అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన తర్వాత ఏకంగా సొంతమైదానంలో మ్యాచ్ ఆడితే ఇక ఆ ప్లేయర్ కి ఆ ఫీలింగ్ మరో రేంజ్ లో ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు తెలుగు క్రికెటర్ కెఎస్ భరత్ కి కూడా ఇలాంటి ఒక గొప్ప ఫీలింగ్ కలగబోతుంది. నేటి నుంచి భారత జట్టు ఇంగ్లాండ్తో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. విశాఖ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.

 ఈ క్రమంలోనే ఇక విశాఖలో రెండో టెస్టులో కేఎస్ భారత్ కూడా టీమిండియాలో భాగం కాబోతున్నాడు. ఇదే విషయం గురించి స్పందించాడు ఈ తెలుగు క్రికెటర్. సొంత ప్రేక్షకుల ముందు క్రికెట్ ఆడుతూ ఉండటం గర్వంగా ఉంది అంటూ కేఎస్ భరత్ చెప్పుకొచ్చాడు. ఏపీకి చెందిన భరత్ ఇంగ్లాండ్ తో రెండో టెస్టు సిరీస్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. మాకు దేశం కోసం ఆడేటప్పుడు.. మా ఆటను ప్రోత్సాహించే వారితో పాటు నిరుత్సాహపరిచే వాళ్ళు కూడా ఉంటారు. మా దృష్టి మాత్రం కేవలం ఆట పైనే ఉంటుంది అంటూ కేఎస్ భరత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: