టీమ్ ఇండియకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్లు దూరం?

praveen
గత కొంతకాలం నుంచి వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది టీమ్ ఇండియా జట్టు. అయితే ఇలా బిజీ క్రికెట్ ఆడుతున్న సమయంలో భారత జట్టును మాత్రం గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. జట్టులో ఉన్న కీలక ప్లేయర్లు గాయం బారిన పడుతూ ఇక చాలాకాలం పాటు జట్టుకు దూరమవుతూనే ఉన్నారు. వరల్డ్ కప్ నాటి నుంచి కూడా ఇదే పరిస్థితి టీమిండియాలో కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అటు ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడబోతుంది టీమిండియా.

 అయితే ఈ టెస్ట్ సిరీస్ సమయంలో కూడా టీమిండియాకు గాయాల బెడద మాత్రం తప్పడం లేదు. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయింది. హైదరాబాదులోనీ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో 28 పరుగులు తేడాతో ఓటమి చవిచూసింది టీమిండియా. అయితే రెండో టెస్ట్ మ్యాచ్ లో తప్పక గెలవాలనే పట్టుదలతో ఉన్న సమయంలో కేఎల్ రాహుల్ రవీంద్ర జడేజా లాంటి ఇద్దరు కీలక ప్లేయర్లు జట్టుకు దూరమయ్యారు. దీంతో వారి స్థానంలో యువ ఆటగాళ్లకు ఛాన్సులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక రెండో టెస్ట్ మాత్రమే కాదు మూడో టెస్ట్ నుంచి కూడా భారత జట్టుకు ఎదురు దెబ్బలు తప్పడం లేదు అన్నది తెలుస్తుంది.

 ఎందుకంటే మూడో టెస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. అదే సమయంలో గాయంతో రెండో టెస్టుకు దూరమైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మూడో టెస్ట్ కు అందుబాటులో ఉండడం కూడా అనుమానమే అని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తొలి రెండు టెస్టులకు దూరమైన షమి ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదని.. దీంతో మిగిలిన మూడు టెస్టులకు కూడా అతను దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇలా కీలక ప్లేయర్లు దూరమైన నేపథ్యంలో రోహిత్ తనకున్న జట్టుతో ఇంగ్లాండు లాంటి పటిష్టమైన జట్టును ఎలా ఎదుర్కోబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: