విశాఖలో రోహిత్ ను ఊరిస్తున్న.. మూడో సెంచరీ రికార్డ్?

praveen
ప్రస్తుతం భారత జట్టు వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది. ఈ క్రమంలోనే భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో ప్రస్తుతం ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే దాదాపు 12 ఏళ్ల నుండి కూడా ఒక్క టీం కూడా భారత జట్టును సొంత గడ్డపై ఓడించి టెస్ట్ సిరీస్ ను దక్కించుకోలేదు. అయితే ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లోను భారతదే ఫైచేయిగా కొనసాగుతుంది అని అందరూ అనుకున్నారు  అయితే ఇక ఇటీవల హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో మాత్రం భారత జట్టుకు పరాజయం తప్పలేదు.

 బజ్ బాల్ అనే ఆటతీరుతో గత కొంతకాలం నుంచి ప్రత్యర్థులపై ఎటాకింగ్ గేమ్ తో ఒత్తిడి పెంచేస్తున్న ఇంగ్లాండ్ జట్టు అటు భారత పర్యటనలో కూడా ఇదే చేసి చూపించింది. ఏకంగా టీమ్ ఇండియా జట్టుపై పైచేయి సాధించి 28 పరుగులు తేడాతో సొంత గడ్డపైన టీమ్ ఇండియాని ఓడించింది  టెస్టు సిరీస్ లో భాగంగా 1-0 తేడాతో ఆదిత్యాన్ని సంపాదించింది అని చెప్పాలి. అయితే ఇక ఈ టెస్ట్ ఓటమి తర్వాత భారత జట్టు ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఇకపోతే ఇలాంటి విమర్శలు మధ్య విశాఖ వేదికగా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది టీమిండియా.

 అయితే ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఎన్నో ఆసక్తికర విషయాలు వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. అయితే రెండో టెస్ట్ మ్యాచ్ కి అటు విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ దూరం కావడంతో ప్రస్తుతం జట్టును గెలిపించే బ్యాటింగ్ భారం మొత్తం అటు కెప్టెన్ రోహిత్ శర్మ మీదే పడింది అని చెప్పాలి. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో కూడా రోహిత్ శర్మ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. కానీ విశాఖలో సెంచరీ చేస్తాడు అని అభిమానులు అనుకుంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. విశాఖ స్టేడియంలో హిట్ మాన్ కు మంచి రికార్డు ఉంది. ఈ మైదానంలో సౌత్ ఆఫ్రికా తో జరిగే ఒకే టెస్టులో రోహిత్ రెండు సెంచరీలు చేశాడు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో మూడో సెంచరీ కొడతాడు అని అభిమానులు అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: