చెత్త ప్రదర్శన చేసినా.. ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో అశ్విన్?

praveen
ఇటీవల కాలంలో కేవలం భారత క్రికెట్లో మాత్రమే కాదు అటు వరల్డ్ క్రికెట్ లో ఏ టీంలో చూసినా యంగ్ ప్లేయర్స్ తో హవా కొనసాగుతూ ఉంది. యువ ఆటగాళ్ళ రాకతో ఎంతోమంది సీనియర్ ప్లేయర్లు తమ ప్రతిభను కొత్తగా నిరూపించుకోలేక.  చివరికి జట్టులో స్థానం కోల్పోతూ ఉండడం చూస్తూ ఉన్నాం   అయితే భారత క్రికెట్లో అయితే ఇలాంటి పోటీ మరింత ఎక్కువగా ఉంది అని చెప్పాలి. అయితే ఇలాంటి పోటీని తట్టుకొని ఎప్పటికప్పుడు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూనే వస్తూ ఉన్నాడు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.

 గత కొంతకాలం నుంచి టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అతను అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే  అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్ బౌలర్ల నుంచి విపరీతమైన పోటీ ఎదురవుతున్నప్పటికీ ఇక ఎప్పటికప్పుడు తన ఆట తీరుతో ఇక తన అగ్రస్థానాన్ని మాత్రం పదిలం చేసుకుంటూనే ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే ఇక ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ పర్వాలేదు అనిపించాడు. మొదటి ఇన్నింగ్స్ లో కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నప్పటికీ.. ఇక రెండో ఇన్నింగ్స్ లో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఇక అతని స్పిన్ బౌలింగ్ పై కాస్త విమర్శలు కూడా వచ్చాయి.

 ఇలా ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో అశ్విన్ కాస్త చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ.. అతని అగ్రస్థానం మాత్రం పదిలంగా ఉంది. ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత బౌలర్లు సత్తా చాటారు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 853 పాయింట్లు టాప్ ప్లేస్ ని సొంతం చేసుకోగా.. ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా 825 పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో సౌత్ ఆఫ్రికా బౌలర్ రబడా, మూడో స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఉన్నారు  ఇక టాప్ టెన్ లో భారత బౌలర్ జడేజా 754 పాయింట్లతో ఆరవ స్థానంలో ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: