రెండో టెస్ట్ కు ముందు.. ఇంగ్లాండ్ జట్టుకి భారీ షాక్?

praveen
ప్రస్తుతం ఇంగ్లాండు, టీం ఇండియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఎంతో రసవత్తరంగా సాగుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ క్రికెట్లో ఉన్న రెండు అగ్రశ్రేణి టీమ్స్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కావడంతో బంతికి బ్యాట్ కి మధ్య హోరాహోరీ సమరం జరగడం ఖాయమని అటు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. అంతే అందరూ ఊహించినట్లుగానే ఇక మొదటి టెస్ట్ మ్యాచ్లో పోరు జరిగింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఇంగ్లాండ్ జట్టు భారత జట్టును సొంత గడ్డమీద 28 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా సొంత గడ్డ మీదే పరాజయం పాలు కావడంతో భారత జట్టు నిరాశలో మునిగిపోయింది. ఈ పరాజయాన్ని అటు భారత క్రికెట్ ఫ్యాన్స్ అయితే అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇక మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన టీమ్ ఇండియా విశాఖ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్ మ్యాచ్లో తప్పక విజయం సాధించాలి అనే పట్టుదలతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. అదే సమయంలో ఇక తొలి టెస్ట్ లో విజయంతో జోరు మీద ఉన్న ఇంగ్లాండ్ రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.

 ఈ క్రమంలోనే విశాఖ వేదికగా ప్రారంభం కాబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం ఇరుజట్లు ప్రత్యేకమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉండగా.. రెండో టెస్టుకు ముందు ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. మొదటి టెస్టులో గాయపడ్డ ఆ జట్టు స్పిన్నర్ జాక్ లీచ్ రెండో టెస్ట్ కు అందుబాటులో ఉండేది అనుమానం గానే కనిపిస్తుందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.  ఈ క్రమంలోనే అతని స్థానంలో 20 ఏళ్ల షోయబ్ బషీర్ టెస్టుల్లోకి ఎంట్రీ ఇస్తాడని సమాచారం. అయితే ఈ విషయంపై ఇక రెండో టెస్ట్ ప్రారంభంనికి ముందు ఇంగ్లాండ్ టీం తుది జట్టు వివరాలను ప్రకటించిన తర్వాత క్లారిటీ రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: