షోయబ్ మాలిక్ నుండి.. సానియా మీర్జా ఎంత భరణం తీసుకుందో తెలుసా?

praveen
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకులు తీసుకున్నారు అన్న వార్త గత ఏడాదిన్నర నుంచి కూడా సోషల్ మీడియాలో  హాట్ టాపిక్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక వీరి విడాకులకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు రావడం తప్ప ఈ ఇద్దరిలో ఒకరు కూడా ఈ విషయంపై స్పందించింది లేదు. కానీ ఇక ఎన్నో రోజుల నుంచి వీరిద్దరూ వేరువేరుగానే ఉంటున్నారు అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమైంది.  అయితే ఇటీవలే వీడి విడాకులకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఆరు నెలల క్రితమే విడాకులు తీసుకొని వేరుపడ్డాము అన్న విషయాన్ని చెప్పేశారు.

 అయితే సానియా మీర్జాకు విడాకులు ఇచ్చాడో లేదో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఏకంగా పాకిస్తాన్ నటి సనా జావేద్ ను మూడో వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. అయితే 2010లో పాకిస్తాన్ క్రికెటర్ ను సానియా  పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు.. తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ఇక విమర్శలను పట్టించుకోకుండా 2010లో పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత వీరి మధ్య దూరం పెరుగుతూ వచ్చి చివరికి విడాకుల వరకు వెళ్ళింది.

 అయితే ఇటీవల తన భర్త షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకొని వేరుపడిన సానియా మీర్జా అతని నుంచి ఎంత భరణాన్ని తీసుకుంది అన్నది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా భార్యాభర్తల మధ్య విడాకులు జరిగిన సమయంలో భర్త భార్యకు భరణం ఇవ్వాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  సెలబ్రిటీలు మాత్రమే కాదు సామాన్యుల విషయంలో కూడా ఇది జరుగుతూ ఉంది. అయితే సానియా మీర్జా షోయబ్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. భరణం అక్కర్లేదు అని పేరు చెప్పిందట. ఒక్క పైసా కూడా ఆశించకుండానే విడాకుల పేపర్స్ పై సంతకం చేసిందట సానియా మీర్జా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: