క్రేజీ న్యూస్ : ఐపీఎల్ లోకి కొత్త జట్టు?

praveen
భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే టి20 నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. 2008లో ఒక సాదాసీదా టీ20 లీగ్ గా ప్రారంభమైన ఐపిఎల్ ఇక ఇప్పుడు ప్రపంచ క్రికెట్లోనే ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాదు వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కూడా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే అంతర్జాతీయ క్రికెట్లో టి20 ఫార్మాట్ కు ఈ రేంజ్ లో క్రేజ్ రావడానికి ఐపీఎల్ ముఖ్య కారణం అనడంలో అతిశయోక్తి లేదు.

 అయితే ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లు అందరూ కూడా ఐపీఎల్ లో భాగం అయ్యి మ్యాచ్ లు ఆడాలని ఆశపడుతూ ఉంటారు. ఈ టోర్నీలో పాల్గొంటే ఒకవైపు ఆదాయంతో పాటు మరోవైపు అనుభవం కూడా వస్తుందని అనుకుంటూ ఉంటారు స్టార్ ప్లేయర్లు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇక ఐపీఎల్ టోర్నీలో ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్ళే కనిపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు ఐపీఎల్ లో కేవలం 8 జట్లు మాత్రమే ప్రతి సీజన్లో తలబడుతూ ఉండేవి. కానీ ఇక బిసిసిఐ గుజరాత్, లక్నో టీంలను కూడా ఐపీఎల్లో చేర్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ లో 10 టీమ్స్ తో పోరు మరింత రసవత్తరంగా మారిపోయింది.

 ఇకపోతే ఇప్పుడు ఐపీఎల్ టోర్నీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఈ టోర్నీలోకి మరో కొత్త టీం రాబోతుందట. ఐపీఎల్ 2027 లోపు టోర్నమెంట్లో కొత్త జట్టు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఆ సీజన్లో మొత్తం 100 మ్యాచ్ లు నిర్వహించే ఛాన్స్ ఉందట. దాదాపు రెండున్నర నెలల పాటు టోర్నీ నిర్వహించబోతుందట బీసీసీఐ. దీనిపై ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటినుంచి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఐపిఎల్ 2024 సీజన్ మార్చ్ 22వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు జరగబోతుంది. అయితే ఇండియాలో నిర్వహిస్తారా విదేశాలలో నిర్వహిస్తారా అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: