చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్.. ఇండియాను ఇండియాలోనే ఎక్కువసార్లు ఓడించింది?

praveen
వరల్డ్ క్రికెట్లో ఉన్న పటిష్టమైన జట్లలో ఒకటిగా కొనసాగుతుంది టీమిండియా. ఇక ఎప్పుడూ కూడా అద్భుతం ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీం ఇండియాతో మ్యాచ్ ఉంది అంటే చాలు ప్రత్యర్ధులు కాస్త భయపడిపోతూ ఉంటాయి.  అయితే అలాంటి టీమ్ ఇండియా జట్టును సొంత గడ్డమీద ఓడించడం అంటే అది అసాధ్యమైన పని. ఈ విషయాన్ని ఏకంగా ప్రత్యర్థి టీమ్స్ కూడా ఒప్పుకుంటూ ఉంటాయి అని చెప్పాలి. అయితే అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది ఇంగ్లాండు జట్టు. ఇటీవల భారత పర్యటనకు టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చినా ఇంగ్లాండ్ జట్టు.. మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే టీమ్ ఇండియాపై ఫైచేయి సాధించింది.

 ఏకంగా భారత జట్టును ఓడించింది. ఇటీవల ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టుకు పరాభవం తప్పులేదు. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో 28 పరుగులు తేడాతో టీమ్ ఇండియా ఓడిపోయింది అని చెప్పాలి. ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి అటు భారత బ్యాట్స్మెన్లు అందరూ కూడా పేక మేడల వికెట్లు కోల్పోయి.  ఫెవిలియన్ బాట పట్టారు. దీంతో టీమ్ ఇండియా పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయ్. ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోని ఉప్పల్ మైదానంలో భారత జట్టుకు మొదటిసారి ఓటమి ఎదురైంది అని చెప్పాలి. ఈ ఓటమితో ఎన్నో చెత్త రికార్డులు కూడా మూటగట్టుకుంది టీమిండియా.

 అదే సమయంలో భారత జట్టుపై మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు.. ఒక అరుదైన రికార్డు సృష్టించింది. ఇండియాలో టీమ్ ఇండియాను టెస్టుల్లో ఎక్కువసార్లు ఓడించిన జట్టుగా రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించింది ఇంగ్లాండు టీం. ఇప్పటివరకు ఇంగ్లాండ్ జట్టు భారత్ పై 65 మ్యాచ్లు ఆడింది. ఏకంగా 15 మ్యాచ్లలో విజయం సాధించింది. ఇక ఆ తర్వాత భారత్ పై టెస్ట్ మ్యాచ్లలో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆస్ట్రేలియా 54 మ్యాచ్లు ఆడి 14 మ్యాచ్లలో టీమిండియాని  సొంత గడ్డ మీదే ఓడించింది. ఇక వెస్టిండీస్ 47 టెస్టులలో 14 మ్యాచ్ లలో జయ కేతనం ఎగరవేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: