ఇండియన్ ఆర్మీలో కొత్త రూల్.. ఇకనుండి బరువు పెరిగితే?

praveen
సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు కూడా హాయిగా గుండె మీద చేయి వేసుకొని నిద్రపోగలుగుతున్నారు అంటే దానికి కారణం సరిహద్దుల్లో సైనికుల నిద్రలేని రాత్రులే అని చెప్పాలి. శత్రు దేశాలు మన దేశంపై దాడి చేయకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా పహారా కాస్తూనే ఉంటారు సైనికులు. కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటూ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి బుల్లెట్ గుండెల్లోకి దూసుకుపోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఇక అనుక్షణం భారత్ మాతాకీ జై అనే నినాదాలు చేస్తూ సరిహద్దుల వద్ద ధైర్యంగా నిలబడి రక్షణ కల్పిస్తూ ఉంటారు.

 అయితే ఇలా ఆర్మీలో పనిచేసే అధికారులు ఫిట్నెస్ విషయంలో ఎంతలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇలాంటి ఫిట్నెస్ ఉంటుంది కాబట్టే గడ్డకట్టుకుపోయే చలిలో కూడా ఎంతో సమర్థవంతంగా ఇక పహార కాయడం చూస్తూ ఉంటాం. అయితే ఇక ఎప్పటికప్పుడు ఆర్మీలో ఉన్న సైనికుల ఫిట్నెస్ ప్రమాణాలను పెంచేందుకు అధికారులు కొత్త కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురావడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఇలాంటి ఒక కొత్త రూల్ భారత ఆర్మీలో ప్రవేశపెట్టారు అని తెలుస్తోంది.

 ఇక నుంచి సైనికులు ఎవరైనా బరువు పెరిగారు అంటే చాలు ఇక వారికి ఇచ్చే సెలవులను కట్ చేయబోతున్నారు అధికారులు. సైనికుల్లో శారీరక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఇలా ఆర్మీలో కొత్త ఫిట్నెస్ రూల్స్ ని ప్రవేశపెట్టారు అన్నది తెలుస్తుంది. వీరి ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. అయితే వయసును బట్టి నిర్మిత టైంలో ఐదు కిలోమీటర్ల రన్నింగ్, 100 మీటర్ల స్ప్రింట్, పుష్ అప్స్, రోప్ క్లైమ్బింగ్, చిన్ ఆప్స్, సిట్ అప్స్ పూర్తి చేయాలి. ఇక బరువు ఎక్కువగా ఉన్నవారు ఫిట్నెస్ నిరూపించుకోవడానికి 30 రోజులు గడువు ఇస్తారు. అప్పుడు కూడా విఫలమైతే ఇక ఆయా ఉద్యోగులకు సెలవులు కట్ చేస్తారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: