సర్పరాజ్ కు జట్టులో చోటు దక్కడంపై.. అతని తండ్రి ఏమన్నాడంటే?

praveen
భారత క్రికెట్లో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. క్రికెట్ ని ఫ్యాషన్ గా మార్చుకుంటున్నా ఎంతో మంది కుర్రాళ్ళు సత్తా చాటుతూ ఉన్నారు. ఇక కొంతమంది ఐపిఎల్ లో అదరగొడుతూ భారత జట్టులోకి వస్తూ ఉంటే.. ఇంకొంత మంది ఆటగాళ్లు ఇక దేశవాళి టోర్నీలలో సత్తా చాటుతూ సెలక్టర్ల చూపును ఆకర్షిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల కాలంలో ఇలా ఎంతో మంది యువ ఆటగాళ్లు భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. కానీ కొంతమంది ఆటగాళ్లకు మాత్రం ప్రతిసారి చేదు అనుభవం ఎదురవుతూనే వస్తుంది అని చెప్పాలి.

 దేశావాలి క్రికెట్లో సత్తా చాటుతున్న సరైన అవకాశాలను మాత్రం దక్కించుకోలేకపోతున్నారు కొంతమంది కుర్రాళ్ళు. ఇక అలాంటి వారిలో సర్పరాజ్ ఖాన్ కూడా ఒకరు అని చెప్పాలి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో  అతని కెరియర్లో ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు ఉన్నాయి. కేవలం 64 ఇన్నింగ్స్ లోనే 3900కు పైగా పరుగులు చేశాడు. ఇక ఇందులో 14 సెంచరీలు కూడా ఉండడం గమనార్హం. ఇలాంటి ప్లేయర్ కి తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాలో చోటు దక్కుతుందని అందరూ అనుకుంటారు. కానీ సెలెక్టర్లు మాత్రం ఇతన్ని గత కొంతకాలం నుంచి అసలు పట్టించుకోవట్లేదు.

 దీంతో ఇక సర్ఫరాజ్ ఖాన్ తీవ్ర నిరాశలో మునిగిపోయాడు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక ఇటీవలే భారత జట్టు నుంచి అతనికి పిలుపు వచ్చింది. రెండు టెస్ట్ మ్యాచ్ కోసం అతన్ని ఎంపిక చేశారు. దీంతో ఇక అభిమానులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక సర్పరాజ్ ఖాన్ కు భారత జట్టులో చోటు తగ్గడంపై అతని తండ్రి నౌషద్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. నా కుమారుడు సర్పరాజ్ కు జాతీయ జట్టుకు ఎంపిక చేసినందుకు బీసీసీఐకి ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగాపూరితమైన పోస్ట్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: