మనోళ్లు బాగా రిలాక్స్ అయ్యారు.. అందుకే ఓడిపోయాం : ఆకాష్ చోప్రా

praveen
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే.  అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇటీవలే హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ ముగిసింది. సాదరణంగా ఇండియా లాంటి పటిష్టమైన టీం ను సొంత గడ్డ మీద ఓడించడం అంత సులభమైన విషయం కాదు. ఇక టెస్ట్ సిరీస్లో అయితే ప్రత్యర్థి టీమ్స్ గెలుస్తాము అనే ఆశలు వదులుకోవాల్సిందే. కానీ ఇటీవల ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో మాత్రం అందరి అంచనాలు తారుమారు అయ్యాయి.

 అద్భుతంగా రాణిస్తుంది అనుకున్న టీమ్ ఇండియా తడబడింది. మొదటి ఇన్నింగ్స్ లో పర్వాలేదు అనిపించినప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. దీంతో ఇక ఇంగ్లాండ్ చేతిలో మొదటి మ్యాచ్ లోనే ఓడిపోయి తీవ్రస్థాయిలో అభిమానులను నిరాశపరిచింది అని చెప్పాలి. ఇక ఈ ఓటమితో భారత జట్టు ఖాతాలో ఎన్నో చెత్త రికార్డులు కూడా చేరిపోయాయి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేయడంపై ఎన్నో విమర్శలు కూడా వస్తున్నాయి. ఎంతో మంది భారత మాజీలు ఇదే విషయంపై స్పందిస్తూ టీమిండియా ఆట తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

 ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా టీమిండియా పై విమర్శలు గుప్పించాడు. ఇంగ్లాండుతో తొలి టెస్ట్ లో భారత ఆటగాళ్లు ఫీల్డింగ్ లో  బాగా రిలాక్స్ అయిపోవడం వల్లనే ఓడిపోయాం అంటూ ఆకాష్ చోప్రా విమర్శించాడు. ఇంగ్లాండు బ్యాటింగ్ సమయంలో మనోళ్ళు ఒత్తిడి పెంచలేకపోయారు. టైలెండర్లు  సింగిల్స్ తీస్తూ బాగా బ్యాటింగ్ చేశారు. మేము కామెంటేటింగ్ లో ఉన్న సమయంలోనే 200 పరుగుల లక్ష్యాన్ని చేదించడం  చాలా కష్టం అనుకున్నాం. అయితే బౌలింగ్ లోను ఇంగ్లాండు ఆటగాళ్లు బాగా ఆడారు అంటూ ఆకాష్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: