రోహిత్ ను కాపీ కొట్టా.. సక్సెస్ అయ్యా : బెన్ స్టోక్స్

praveen
ప్రస్తుతం భారత జట్టు అటు ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ కోసం అటు ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. కాగా ఇటీవల హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఉప్పల్ స్టేడియంలో ఇప్పటివరకు టీమ్ ఇండియా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దీంతో ఇంగ్లాండ్ పై మొదటి టెస్టులో భారత జట్టుదే విజయం అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి సమయంలో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్ జట్టు మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియాని ఓడించింది. ఏకంగా 28 పరుగులు తేడాతో భారతపరాజయం ఎదురయింది అని చెప్పాలి.

 దీంతో టీమ్ ఇండియా ఫ్యాన్స్ అందరు కూడా నిరాశలో మునిగిపోయారు. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం పై ఇంగ్లాండ్ కెప్టెన్ బేన్ స్టోక్స్ సంతోషం వ్యక్తం చేశాడు. తన కెప్టెన్సీ కెరియర్ లోనే ఇది ఒక గొప్ప విజయం అంటూ చెప్పుకొచ్చాడు స్టోక్స్  భారత ఆట తీరును క్షుణ్ణంగా పరిశీలించి ప్రణాళికలను రచించాము అంటూ స్టోక్స్ చెప్పుకొచ్చాడు  నేను కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్నాం. కొన్నింటిలో ఓడిన అసాధారణ మ్యాచులలో భాగమయ్యామ్. వేదిక ఏదైనా ప్రత్యర్థి ఎవరైనా గొప్ప ప్రదర్శన కనబరిచాము. ఇక ఈ విజయం చాలా గొప్పది  కెప్టెన్గా విదేశాల్లో నేను సాధించిన తొలి విజయం ఇదే.

 నేను మ్యాచ్ ను బాగా పరిశీలిస్తుంటా.. రోహిత్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను  భారత స్పిన్నర్ ఎలా బౌలింగ్ వేస్తున్నారు. రోహిత్ ఎలా వారిని వాడుకుంటున్నాడు  ఫీల్డ్ ప్లేస్మెంట్ ఎలా ఉంది అని పరిశీలించా. ఇక మా ఫీల్డింగ్ సమయంలో రోహిత్ లాగానే ఫీల్డ్ సెట్ చేయడంతో పాటు రోహిత్ లాగే బౌలర్లను మార్చే ప్రయత్నం చేశా. చివరికి సక్సెస్ అయ్యాము. అయితే ఈ విజయం ప్రతి ఒక్కరిని కూడా థ్రిల్ చేసింది అంటూ బెంజ్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ఓలిపోప్ అసాధారణ ఇన్నింగ్స్ తో జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అంటూ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: