జట్టు ఓడిపోయినా.. జడేజా అరుదైన ఘనత?

praveen
ప్రస్తుతం ఇంగ్లాండ్ టీమిండియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండు జట్టు భారత పర్యటనకు వచ్చింది. అయితే హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ ఇటీవలే ముగిసింది. అయితే నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన హోరాహోరీ పోరులో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది అని చెప్పాలి  దాదాపు12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై భారత జట్టు టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో దూకుడుగా ఆడిన తీరు చూస్తే ఎంతో అలవోకగా భారత జట్టు విజయం సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు.

 కానీ ఊహించని రీతిలో భారత జట్టుకు మొదటి అడుగులోనే పరాభవం ఎదురయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత జట్టు ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని సార్లు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న టీమ్ ఓడిపోయినప్పటికీ ఇక జట్టులోని ఆటగాళ్లు మాత్రం అత్యుత్తమ ప్రదర్శన చేసి రికార్డులు కొల్లగొట్టడం చేస్తూ ఉంటారు. ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇదే జరిగింది. అటు భారత జట్టు ఓడిపోయినప్పటికీ జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా మాత్రం అరుదైన ఘనతను సాధించాడు.

 ఏకంగా అన్ని ఫార్మాట్లలో భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానం లో కొనసాగుతున్న జవగల్ శ్రీనాద్ ని వెనక్కి నెట్టాడు రవీంద్ర జడేజా. జవగల్ శ్రీనాథ్ 551 వికెట్లతో ఉండగా, ఇటీవల రవీంద్ర జడేజా 552వ వికెట్ పడగొట్టి ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల జరిగిన మ్యాచ్లో బెయిర్ స్ట్రో వికెట్ తీయడంతో ఈ ఘనత సాధించాడు జడేజా. ఈ లిస్టులో అనిల్ కుబ్లె 953, అశ్విన్ 723, హార్భజన్ సింగ్ 707, కపిల్ దేవ్ 687, జహీర్ ఖాన్ 597 వికెట్లతో ఇక జడేజా కంటే ముందున్నారు. ఇకపోతే మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోవడంతో టీమిండియా ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: