అంతలోనే ఎంత మార్పు.. అశ్విన్ - జడేజా చెత్త రికార్డ్?

praveen
ప్రస్తుతం ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకవైపు ఇంగ్లాండ్ మరోవైపు టీమ్ ఇండియా వరల్డ్ క్రికెట్ లో అగ్రశ్రేణి టీమ్స్ గా కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉండడంతో హోరాహోరీ పోరు జరగడం ఖాయమని అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఫిక్స్ అయ్యారు. బంతికి బ్యాడ్ కి మధ్య వీరోచిత సమరం జరుగుతుంది అని అంచనా వేశారు. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతూ ఉండడం గమనార్హం.

 అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో కాస్త తడబడినట్లు కనిపించింది ఇంగ్లాండ్ జట్టు. అటు భారత బ్యాట్స్మెన్లు మాత్రం భారీగా పరుగులు చేశారు. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా పుంజుకుంది అని చెప్పాలి. క్రీజులో పాతుకు పోయి పరుగుల వరద పారిస్తూ ఉన్నారు ఆ జట్టు బ్యాట్స్మెన్లు. దీంతో కొన్ని చెత్త రికార్డులు అటు భారత బౌలర్లు ఖాతాలో చేరిపోతున్నాయి. మొదటి ఇన్నింగ్స్ లో పరుగులను కట్టడి చేయడమే కాదు వికెట్లు తీసి అరుదైన రికార్డు సృష్టించింది అశ్విన్ - జడేజా జోడి. దీంతో రెండో ఇన్నింగ్స్ లో కూడా అదరగొట్టడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో రెండు ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు చెలరేగిపోయారు. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన అశ్విన్ - జడేజా జోడి ఎక్కడ ప్రభావం చూప లేకపోయింది.

 భారీగా పరుగులను సమర్పించుకుంది అని చెప్పాలి. ఏకంగా అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో 126 పరుగులు సమర్పించుకోగా.. రవీంద్ర జడేజా 131 పరుగులు ఇచ్చాడు. అయితే ఇండియాలో సెకండ్ ఇన్నింగ్స్ లో ఇద్దరు బౌలర్లు  100కు పైగా పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే రెండు ఇన్నింగ్స్ లో కలిపి అటు అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి. కాగా రసవత్తారంగా సాగుతున్న ఈ మ్యాచ్ లో గెలవాలి అంటే రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు బ్యాటింగ్లో అదరగొట్టాల్సి ఉంటుంది. లేదంటే మొదటి మ్యాచ్ లోనే చేదు అనుభవం తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: