యువరాజ్ ఆరు సిక్సర్ల రికార్డుకు ఎసరు పెట్టాడు.. కానీ జస్ట్ మిస్?

praveen
టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ బాదిన ఆరు సిక్సర్ల రికార్డును భారత క్రికెట్ ప్రేక్షకులు ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. ఎందుకంటే వరల్డ్ క్రికెట్లో కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమైన రికార్డు ఇది. ఏకంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు యువరాజ్. ఇప్పటికీ కూడా ఎంతోమంది క్రికెటర్లు ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎవరైనా ఆటగాడు ఇలా ఒకే ఓవర్లో బౌండరీలతో చెలరేగిపోయాడు అంటే చాలు ఇక అతన్ని యువరాజ్ సింగ్ తో పోల్చి చూడడం చేస్తూ ఉంటారు.

 అయితే ఇండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ క్రియేట్ చేసిన 6 బంతుల్లో ఆరు సిక్సర్ల రికార్డును ఇక ఎప్పుడు ఏకంగా ఒక ఆటగాడు బ్రేక్ చేయబోయాడు. కానీ కేవలం రెండు పరుగుల తేడాతో అతను ఈ రికార్డుకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు అని చెప్పాలి. ప్రస్తుతం ఐసీసీ మెన్స్ అండర్ 19 వరల్డ్ కప్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక వరల్డ్ కప్ లో భాగంగా కుర్రాళ్ళు కుమ్మేస్తున్నారు. ప్రతి మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్లో ఏకంగా ఒక సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఇండియన్ మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ రికార్డుకే ఎసరుపెట్టాడు.

 ఇటీవల అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ స్టీవ్ స్టాక్ విధ్వంసం సృష్టించాడు అని చెప్పాలి. ఖాసీం ఖాన్ వేసిన మూడో ఓవర్ లో అతను ఏకంగా 6,6,6,6,4,6 బాదాడు. బౌండరీలతో రేచ్చిపోయాడు. అయితే కేవలం మధ్యలో ఒక ఫోర్ రావడంతో ఇక ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు. అయితే ఇక అతను మొత్తంగా 13 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఫలితంగా ఈ టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. మొత్తంగా 37 బంతులు ఆడిన ఈ బ్యాట్స్మెన్ 83 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 7ఫోర్లు ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: