మరో అరుదైన అవార్డు రేసులో.. సూర్య కుమార్ యాదవ్?

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియా లో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ టి20 ఫార్మాట్లో ఎంతటి విధ్వంసకర  ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా మైదానం నలువైపులా ఎంతో అలవోకగా బౌండరీలు బాదుతూ అటు బౌలర్లకు ముచ్చమటలు పట్టిస్తూ ఉంటాడు సూర్యకుమార్. ఇక పొట్టి ఫార్మాట్లో నేటితరంలో అతన్ని మించిన ఆటగాడు మరొకరు లేరు అనే విధంగా ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సెంచరీల మోత మోగిస్తూ ఏకంగా ఐసిసి ర్యాంకింగ్స్ లో కూడా గత కొన్ని నెలల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నాడు.

 ఈ క్రమంలోనే తన ఆట తీరుతో ఎన్నో అరుదైన రికార్డులు కూడా దక్కించుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే  ఇక ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా సూర్యకుమార్ యాదవ్ ఆట తీరుకు మెచ్చి అరుదైన అవార్డును  కూడా ప్రకటించింది. టి20 ఫార్మాట్లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా ప్రకటించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అయితే ఇలా అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టిన సూర్య కుమార్ యాదవ్ ఇక ఇప్పుడు మరో అరుదైన అవార్డు రేసులో ఉన్నాడు అన్నది తెలుస్తుంది.

 అయితే సూర్య కుమార్ యాదవ్ మాత్రమే కాదు ఇతర జట్లకు చెందిన ఎంతో మంది ఆటగాళ్లు కూడా గత ఏడాది సెంచరీల మోత మోగించారు. అయితే ఇలా ఎంతో మంది ప్లేయర్స్ సెంచరీలు చేయగా వాటన్నింటిలో నుంచి క్రిక్ ఇన్ఫో టాప్ ఫైవ్ సెంచరీలను సెలెక్ట్ చేసింది. ఇందులో నుంచి ఒకరిని ఎంపిక చేసి మెన్స్ టి20 బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కట్టబెట్టబోతుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇక ఇందులో టీమిండియా బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ శ్రీలంకతో మ్యాచ్లో చేసిన 111 పరుగులు,  ఫీల్ సాల్ట్ వెస్టిండీస్ తో మ్యాచ్లో చేసిన 119 పరుగులు, మాక్స్ వెల్ ఇండియా తో జరిగిన మ్యాచ్ లో చేసిన 104 పరుగులు, జాన్సన్ చార్లెస్ సౌత్ ఆఫ్రికా తో జరిగిన 118 పరుగులు, డికాక్ వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో చేసిన 100 పరుగులు కూడా ఇక ఈ అవార్డు రేసులో ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: