క్రీడా స్ఫూర్తిని మరిచిన ఆస్ట్రేలియా.. ఏం చేసిందో తెలుసా?

praveen
ప్రస్తుతం వెస్టిండీస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య పింక్ బాల్ టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఇటీవలే అటు వెస్టిండీస్ జట్టు అద్భుతమైన పోరాటం చేసింది. 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సమయంలో అద్భుత పోరాటంతో తొలి ఇన్నింగ్స్ లో 311 పరుగులు చేసింది వెస్టిండీస్. అత్యుత్తమమైన బంతులను సంధిస్తున్న ఆస్ట్రేలియా బౌలర్లను ఎంతో సులభంగా ఎదుర్కోగలిగింది అని చెప్పాలి. అయితే సాధారణంగానే ఆస్ట్రేలియా బౌలర్లను వారి గడ్డపై ఎదురుకోవడం చాలా కష్టమైన విషయం. కానీ వెస్టిండీస్ అదరగొట్టేసింది.

 జాషువా డిసిల్వా 79, హోల్డ్ 71, కెవిన్ సిక్లైర్ 50, అల్జారి జోసెఫ్ 32 పరుగులతో గొప్ప పోరాటం చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ కాదు ఏకంగా భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర వహించారు అని చెప్పాలి. మరి ముఖ్యంగా రోజ్, అల్జారి జోసెఫ్ అయితే బ్యాట్ తో నిప్పులు చెరుగుతూ ఆస్ట్రేలియా బ్యాటర్లకు చెమటలు పట్టించారు  ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు వ్యవహరించిన తీరు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది   క్రీడా స్ఫూర్తిగా విరుద్ధంగా వ్యవహరించారు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరూ ఆస్ట్రేలియా ఆట తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు అని చెప్పాలి.

 ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో రోజ్ సింగిల్ కు ప్రయత్నించాడు  కానీ నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న కెవిన్ సింక్లైన్ వద్దని చెప్పాడు. ఈ క్రమంలోనే రోజ్ స్లిప్ అయ్యి పిచ్ మీద పడిపోయాడు. దీంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. అయితే మరోవైపు ఆస్ట్రేలియా ఫీల్డర్లు రనౌట్ చేశారు. అయితే బ్యాట్స్మెన్లు కింద పడినప్పుడు క్రీడా స్ఫూర్తితో ఫీల్డింగ్ జట్టు చాలా సందర్భాల్లో రన్ అవుట్ చేయకుండా విడిచి పెట్టడం చూస్తూ ఉంటాం. కానీ వెస్టిండీస్ టీం కి ఆస్ట్రేలియా మాత్రం ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఫీల్డర్ గ్రీస్ మధ్యలో పరిగెత్తడానికి ప్రయత్నించి కింద పడిపోయినప్పటికీ ఇక ఆస్ట్రేలియా మాత్రం రన్ అవుట్ చేసింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.  ఇది పూర్తిగా క్రీడా స్ఫూర్తిగా విరుద్ధం అంటూ ఎంతో మంది నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: