మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. షోయబ్ మాలిక్ ఏమన్నాడో తెలుసా?

praveen
పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ గత కొంతకాలం నుంచి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాడు. ఏకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడిపోయాడు షోయబ్ మాలిక్. ఎన్నో రోజుల నుంచి విడాకులకు సంబంధించిన వార్తలు వస్తున్నప్పటికీ ఇటీవల  షోయబ్ మాలిక్ ఏకంగా మూడో పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ నటి సనా జావేద్ షోయబ్ మాలిక్ తో పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇక ఆ తర్వాత మాలిక్, సానియా మధ్య విడాకులు జరిగాయి అన్నది అందరికీ అర్థమైంది.

 ఇలా సానియా మీర్జాతో విడాకులు మాత్రమే కాదు ఏకంగా నటి సనా జావేద్ తో మూడో పెళ్లి చేసుకొని వార్తలు హాట్ టాపిక్ గా మారిపోయిన షోయబ్ మాలిక్ ఇక బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఒక మ్యాచ్ లో ఏకంగా మూడు నో బాల్స్ వేసి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. స్పిన్నర్ అయ్యుండి ఇలా షోయబ్ మాలిక్ మూడు నోబాల్స్ వేయడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ తర్వాత అతను మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడు అంటూ వార్తలు తెరమీదకి రావడంతో చివరికి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ఫార్చూన్ బరిషల్ జట్టు అతనితో కాంట్రాక్టు రద్దు చేసుకుంది అంటూ వార్తలు వచ్చాయి.

 ఈ క్రమంలోనే ఇలా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడు అంటూ తనపై వస్తున్న వార్తలపై పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఫార్చ్యూన్ బరిషల్ జట్టు అతనితో కాంట్రాక్టు రద్దు చేసుకుందన్న వార్తలను ఖండించాడు షోయబ్ మాలిక్. ఇది ముందస్తుగానే యాజమాన్యంతో చర్చించి తీసుకున్న నిర్ణయం అని దుబాయ్ లో ఒక కార్యక్రమానికి హాజరు కావాల్సి రావడంతో చివరికి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుంచి యాజమాన్యం అనుమతితోనే తప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు షోయబ్ మాలిక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: