ఆ రోజు నన్ను చంపేస్తారనుకున్నా.. షాకింగ్ విషయం చెప్పిన పృథ్వి షా?

praveen
ఒకప్పుడు భారత క్రికెట్లో యంగ్ సెన్సేషన్ క్రికెటర్ గా పేరు సంపాదించుకున్న పృథ్వి షా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. దేశవాళీ  క్రికెట్లో అదరగొట్టి ఏకంగా సముద్రపు అలల భారత జట్టులోకి దూసుకొచ్చాడు. అయితే ఎంత వేగంగా అయితే దూసుకు వచ్చాడో అంతే వేగంగా మళ్ళీ కనిపించకుండా పోయాడు ఈ ఆటగాడు. మొదటి టెస్ట్ లోనే సెంచరీ చేసి అందరి మన్ననలు అందుకున్న పృథ్వి షా ఆ తర్వాత నిలకడలేమిటో చివరికి భారత జట్టుకు దూరమయ్యాడు. ఇక అనవసరమైన వివాదాలతో తరచూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయేవాడు.

 ఇక తరచూ గాయాల బెడద వేధించడం కూడా అతని కెరియర్ను దెబ్బతీసింది అని చెప్పాలి   కాగా అతను భారత జట్టు తరుపున మ్యాచ్ ఆడి దాదాపు రెండేళ్లు కావస్తోంది  అయితే గతంలో నటి సాప్నా గిల్ తో పబ్లిక్ గొడవ కారణంగా షా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్న విషయం తెలిసిందే  అయితే ఈ గొడవకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఆరోజు నేను నా ఎనిమిది మంది స్నేహితులతో కలిసి హోటల్కు వెళుతున్నాను. పక్కనే టేబుల్ పై కూర్చున్న నలుగురు ఐదుగురు వ్యక్తులు నా దగ్గరకు సెల్ఫీ కోసం వచ్చారు. ఫోటోలు సరిగ్గా రాలేదని మరోసారి సెల్ఫీ తీసుకున్నారు. తర్వాత ఓ జంట నా భుజాలపై చేతులు వేసి అనుమతి లేకుండా వీడియోలు తీయడం మొదలు పెట్టింది.

 దీంతో నేను అడ్డు చెప్పగా హోటల్ మేనేజ్మెంట్ ఇది గమనించి వారిని బయటికి పంపించారు. ఆ తర్వాత నేను హోటల్ బయటకి రాక సప్నా గిల్ బేస్ బాల్ బ్యాట్ తో నిల్చుని ఉంది. ఆ సమయంలో ఆమెతో పాటు ఉన్నవారు మామూలు మనుషుల్లా కనిపించలేదు. బయట నాకోసం ఎదురు చూస్తున్నారు. ఇక తర్వాత కారు తీసుకుని వెళ్లాను. ఒక చెక్పోస్ట్ వద్ద స్లో చేయగానే కారుపై బేస్బాల్ బ్యాట్ తో దాడి చేశారు. అప్పుడు నేను ఎంతగానో భయపడ్డాను. వెంటనే కారు నుంచి బయటికి వచ్చి ఆమె చేతిలోనే బేస్ బాల్ బ్యాట్ లాగేసాను. లేకపోతే ఆమె నాకు కారును పూర్తిగా నాశనం చేసేది. అయితే ఆమె చేతిలో ఉన్న బ్యాడ్ లాక్కున్న వీడియోలు మాత్రమే సోషల్ మీడియాలో చూపించారు. అనవసరపు వివాదంలో నన్ను ఇరికించారు. దీంతో నా స్నేహితులు కార్ లో అక్కడి నుంచి వెళ్ళిపోయాను  ఆ సమయంలో వారు నన్ను చంపేస్తారని అనుకున్న. అనంతరం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను అంటూ పృథ్వి షా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: