చరిత్ర సృష్టించిన.. అశ్విన్ - జడేజా జోడీ?

praveen
ప్రస్తుతం ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ ని ఇరు జట్లు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ గా  కొనసాగుతున్న రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉండడంతో బంతికి బ్యాట్ కి మధ్య హోరాహోరీ సమరం జరగడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. ఇక అందుకు తగ్గట్లుగానే నువ్వా నేనా అన్నట్లుగా టెస్ట్ మ్యాచ్లో సమరం సాగిస్తూ ఉన్నాయి ఇరు జట్లు. కాగా మొదటి మ్యాచ్ హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది.

 కాగా ఈ టెస్ట్ మ్యాచ్ ఎన్నో అరుదైన రికార్డులకు వేదికగా మారిపోయింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఎంతోమంది ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేసే అరుదైన రికార్డులను ఖాతాలు వేసుకుంటున్నారు.  ఈ క్రమంలోనే భారత జట్టులో కీలకమైన ప్లేయర్లుగా కొనసాగుతున్న అశ్విన్, రవీంద్ర జడేజాలు కూడా ఇలాంటి అరుదైన రికార్డును సాధించారు అని చెప్పాలి. ఈ ఇద్దరు స్పిన్నర్ల జోడి ఎప్పుడు కూడా భారత జట్టు కోసం అత్యుత్తమ ప్రదర్శన చేయడం చేస్తూ ఉంటారు. బంతితోనే కాదు బ్యాట్ తోను కూడా అవసరమైనప్పుడు అదరగొడుతూ ఉంటారు అని చెప్పాలి.

 కాగా భారత జట్టు తరఫున టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జోడిగా అశ్విన్, జడేజా జోడి రికార్డు సృష్టించింది. ఇప్పుడు వరకు భారత జట్టు తరఫున టెస్ట్ ఫార్మాట్లో ఈ ఇద్దరి జోడి ఏకంగా 503 వికెట్లు పడగొట్టింది అని చెప్పాలి. అయితే 50 మ్యాచ్లలో వీరు ఈ ఘనత సాధించడం గమనార్హం. ఇంతకుముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే - హార్బర్జన్ సింగ్ పేరిట ఉండేది. ఏకంగా 54 మ్యాచ్లో 501 వికెట్లు పడగొట్టారు అనిల్ కుంబ్లే - హర్భజన్ సింగ్ జోడి. ఇక ఇప్పుడు ఈ రికార్డును అశ్విన్ - జడేజా జోడి బద్దలు కొట్టింది అని చెప్పాలి. ఈ రెండు జోడీల తర్వాత మూడో స్థానంలో జహీర్ ఖాన్ హర్భజన్ సింగ్ జోడి ఉంది. 59 మ్యాచ్లలో 474 వికెట్లు పడగొట్టారు ఈ జోడి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: