చరిత్ర సృష్టించిన కోహ్లీ.. క్రికెట్ హిస్టరీలో ఒకే ఒక్కడు?

praveen
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి అటు వరల్డ్ క్రికెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరిలాగానే ఒక సాదాసీదా క్రికెటర్ గా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. అతి తక్కువ సమయంలోనే తాను చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని నిరూపించాడు. మూడు ఫార్మాట్ లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాదు.. ఇక తన అత్యుత్తమ ఆట తీరుతో ప్రత్యర్ధులను వణికించాడు అని చెప్పాలి.

 ఏకంగా విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి వచ్చిన పరుగుల ప్రవాహానికి స్కోర్ బోర్డ్ సైతం పరిగెత్తి పరిగెత్తి అలసి పోయింది అనడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. అంతలా ఇప్పటివరకు భారీగా పరుగులు చేసి రికార్డులు కొల్లగొట్టాడు. ఇక ఇలాంటి రికార్డుల విషయంలో నేటి తరంలో ఉన్న స్టార్ ప్లేయర్లు ఎవరూ కూడా విరాట్ కోహ్లీకి కనీసం దరిదాపుల్లో కూడా లేరు. అయితే ఇన్ని పరుగులు చేసిన ఇంకా దాహం తీరలేదు అన్నట్లుగా విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొట్టేస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇక ఇలా అదరగొట్టిన కోహ్లీ ఎప్పుడు అటు icc ప్రకటించే అవార్డులలో కూడా సత్తా చాటుతూ ఉంటాడు.

 ఇకపోతే గత ఏడాది వన్డే ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ కి ఇటీవలే ఐసీసీ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఏకంగా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డుకు విరాట్ కోహ్లీకి బహుకరించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. గత ఏడాది ప్రతిభ ఆధారంగా ఈ అవార్డుకు కింగ్ కోహ్లీని ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. అయితే ఈ అవార్డు రావడంతో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఏకంగా నాలుగుసార్లు వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న తొలి ప్రేయర్ గా కోహ్లీ నిలిచాడు. 2012, 2017, 2018, 2023 లలో ఇలా వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: