బిగ్ బాస్ కు వెళ్లి.. తప్పు చేశాను అంటున్న ప్రియాంక జైన్?

praveen
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరు సంపాదించుకుంది బిగ్ బాస్. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలో ఒకసారైనా పాల్గొనాలని ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు ఆశపడుతూ ఉంటారు. అయితే ఇప్పటికే తెలుగులో ఏకంగా ఏడు సీజన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది ఈ షో. ఇక ఉల్టా ఫుల్టా అనే కాన్సెప్ట్ తో బిగ్ బాస్ ఏడవ సీజన్ ప్రేక్షకులను వినూత్నంగా అలరించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్లో కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు.

 అయితే ఈ షోలో షార్ట్ హెయిర్ కట్ లో ఎంతో క్యూట్ గా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులు అందరిని ఫిదా చేసింది ప్రియాంక జైన్. గతంలో జానకి కలగనలేదు అనే సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ప్రియాంక జైన్ బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించింది. అయితే ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ నడుపుతూ బిజీగా ఉంది. ఇటీవల ఒక వీడియో చేసిన ప్రియాంక  బిగ్ బాస్ షో కి వెళ్లి తప్పు చేశాను అంటూ ఎంతగానో బాధపడింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. తన తల్లికి ఇటీవల సర్జరీ జరిగింది అంటూ ప్రియాంక వెల్లడించింది. అయితే గత కొంతకాలంగా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. వయసు పెరుగుతుండడం వల్ల జరిగే మార్పులు అనుకున్నట్లు ఇక తన ప్రియుడు శివకుమార్ తో చెప్పుకొచ్చింది.

 ఆస్పత్రిలో చెక్ చేయిస్తే క్యాన్సర్ ఉంది అన్న విషయం డాక్టర్లు చెప్పారు. అయితే ప్రియాంక బిగ్ బాస్ లో ఉన్నప్పుడే తల్లికి ప్రాబ్లం మొదలైంది. అయితే ప్రియాంక బిగ్ బాస్ షోలో చూడాలని అనుకున్నా ఆమె తల్లి ఆస్పత్రిలో అడ్మిట్ కావడానికి ఇష్టపడలేదుట. చివరికి మేం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలా అయిందంటూ బాధపడింది ప్రియాంక. బిగ్ బాస్ షో కి పోకుండా ఉంటే ఆమెను బాగా చూసుకునే దాన్ని అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. గర్భాశయం తొలగిస్తే క్యాన్సర్ తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్లు ప్రియాంక జైన్ చెప్పుకొచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: