షాకింగ్ : కరోనా సోకిన ప్లేయర్ కు.. తుది జట్టులో చోటు?

praveen
ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ సృష్టించిన అల్లకల్లోలం గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ప్రశాంతం గా ఉన్న ప్రపంచాన్ని మొత్తం భయం గుప్పెట్లోకి నెట్టింది మహమ్మారీ కరోనా వైరస్. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా కనిపించని శత్రువు తో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అందరూ కూడా మాస్క్ అనే ఒక ముసుగు లోకి వెళ్ళిపోయి.. ప్రాణాలను రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.

 అయితే కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ దేశాలు అన్నింటి లోకి పాకిపోయిన తర్వాత.. ఇక అన్ని రకాల క్రీడలు కూడా నిలిచిపోయాయి అని చెప్పాలి. ఎప్పుడు ఇక వరుసగా మ్యాచ్లతో బిజీ బిజీగా ఉండే క్రీడాకారులందరూ కూడా కొన్ని నెలల పాటు ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమం లోనే క్రికెట్ మ్యాచ్ లన్ని ఆగి పోయాయి. అయితే ఆ తర్వాత కాలంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోవడం తో.. మళ్లీ క్రికెట్ మ్యాచ్ జరగడం మొదలయ్యాయి. అయితే కరోనా వైరస్ బారిన పడిన ప్లేయర్లను పక్కన పెడుతూ జాగ్రత్తలు తీసుకుంటూ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించారు.

 ఇప్పటికీ కూడా ఇలా ఎవరైనా ఆటగాడు కరోనా వైరస్ బారిన పడితే అతన్ని పక్కన పెట్టడం చేస్తున్నారు. అయితే ఇక్కడ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఒక పెద్ద సాహసం చేసింది. ఏకంగా మ్యాచ్ కు ఒక రోజు ముందు కరోనా వైరస్ బారిన పడ్డ ఆ జట్టు ఆటగాడు కామరూన్ గ్రీన్ ను ప్లేయింగ్ 11 లో చోటు కల్పించింది. దీంతో అతను వెస్టిండీస్తో మ్యాచ్కు ముందు గీతాలాపన సందర్భం గా సహచర ప్లేయర్లు అందరితో కలిసి లైన్లో నిలబడకుండా దూరం గా నిలబడ్డాడు. కోవిడ్ కు సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: