జట్టులో కోహ్లీ లేకపోవడం.. ఇంగ్లాండ్ కు కలిసొస్తుందా?

praveen
గత కొంతకాలం నుంచి వరుసగా ద్వైపాక్షక సిరీస్ లతో బిజీబిజీగా ఉన్న టీమిండియా.  ఇక ఇప్పుడు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. కాగా మొదటి టెస్ట్ మ్యాచ్ అటు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే ఇక ఒకవైపు ఇంగ్లాండ్ మరోవైపు ఇండియా వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ గా కొనసాగుతున్నాయి.

 అలాంటి రెండు టీమ్స్ మధ్య ప్రతిష్టాత్మకమైన టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉండడంతో బంతికి బ్యాట్ కి మధ్య హోరాహోరీ సమరం జరగడం ఖాయమని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ లో ఎవరు మంచి ప్రదర్శన చేస్తారు అనే విషయంపైనే అందరి దృష్టి ఉంది. అయితే టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లకు దూరం కాబోతున్నాడు. వ్యక్తిగత కారణాలతో అతను జట్టు నుంచి తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమం లోనే విరాట్ కోహ్లీ లేకపోవడం తో రజత్ పాటిదార్ ను  జట్టులోకి తీసుకుంది టీం ఇండియా యాజమాన్యం. అయితే విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ లేకపోవడం తో అటు ఇంగ్లాండ్ జట్టుకు కలిసి వస్తుందా అనే చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే 2016లో విశాఖ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ నుండి కూడా విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పై పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు. ఇక అలాంటి ఆటగాడు రెండు టెస్ట్ మ్యాచ్లకు అందుబాటులో లేకపోవడంతో.. ఇంగ్లాండు ఇక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఛాన్స్ ఉంది అని ఎంతో మంది క్రికెట్ విశేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: