నేనేమైనా వీసా కార్యాలయంలో పనిచేస్తున్నానా : రోహిత్

praveen
ప్రస్తుతం టీమిండియా భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయం పైన ప్రస్తుతం భారత క్రికెట్లో ఎక్కడ చూసిన చర్చ జరుగుతూ ఉంది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ఇరు జట్లు కూడా గత కొంతకాలం నుంచి ప్రాక్టీస్ లో మునిగి తేలాయి. ఇక ఇప్పుడు అధికారిక మ్యాచ్ లో ఏకంగా హౌరాహోరీగా తలబడేందుకు సిద్ధమవుతున్నాయ్ అని చెప్పాలి.

 ఇక ఇరు జట్లు కూడా పవిత్రమైన వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. ఇదిలా ఉంటే అటు ఇంగ్లాండ్ జట్టులో స్పిన్నర్గా కొనసాగుతున్న షోయబ్ బషీర్, వీసా విషయంలో జరిగిన వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. టీమిండియాతో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండు క్రికెట్ బోర్డు అతన్ని ఎంపిక చేసింది. జట్టు సభ్యులతో పాటుగానే అతను కూడా ఇండియా చేరుకున్నాడు. కానీ వీసా జాప్యంతో చివరికి అతను బ్రిటన్ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పాలి.

 అయితే కావాలనే ఇదంతా చేస్తున్నారు అంటూ కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటే.. ఇది క్రీడా స్ఫూర్తికి  విరుద్ధమంటూ మరి కొంతమంది చేస్తున్నారు అని చెప్పాలి. ఇలా షోయబ్ బషీర్ వీసా వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఇక మ్యాచ్ కి ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఇదే విషయంపై ప్రశ్న ఎదురయింది. ఈ క్రమంలోనే ఇక రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర సమాధానం చెప్పాడు. షోయబ్ బషీర్ వీసా బ్రిటన్ తిరిగి వెళ్లడంపై రిపోర్టర్ అతని ప్రశ్నించగా.. ఇక ఈ ప్రశ్నకు స్పందించిన రోహిత్ శర్మ.. బషీర్ కు జరిగిన దానికి ఎంతగానో చింతిస్తున్న. అయితే వీసాలు మంజూరు చేయడానికి నేను వీసా కార్యాలయంలో పనిచేస్తున్నానా అంటూ రోహిత్ కామెంట్ చేయడంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు.

 అయితే గత 12 ఏళ్లుగా ఇండియా వేదికగా జరిగిన ప్రతి టెస్ట్ సిరీస్ లో విజయం సాధిస్తూ వచ్చిన టీమిండియా ఇక ఇప్పుడు అటు ఇంగ్లాండ్ పై కూడా సిరీస్ లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో ఎటాకింగ్ గేమ్ తో ప్రత్యర్థులను భయపెడుతున్న ఇంగ్లాండ్ టీమిండియాను సొంత గడ్డమీద ఓడించి సత్తా చాటాలని భావిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: