ధోని రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ.. ఇండియన్ క్రికెట్ లో ఒకే ఒక్కడు?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వరల్డ్ క్రికెట్లో ఎంతలా హవా నడిపిస్తూ ఉన్నాడో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తాను ఇక క్రికెట్ చరిత్రలో లెజెండ్ గా నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని నిరూపించాడు. తన ఆట తీరుతో ఎంతోమంది క్రికెట్ లెజెండ్స్ సాధించిన రికార్డులను ఎంతో అలవోకక బద్దలు కొట్టి తనకు తిరుగులేదు అని నిరూపించాడు విరాట్ కోహ్లీ. అద్భుతమైన ఆట తీరుతో ఎప్పుడూప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి  ఇప్పటికే ఎన్నో వేల పరుగులు చేశాడు. అయినప్పటికీ దాహం తీరలేదు అన్నట్లుగా ప్రతి మ్యాచ్ లో కూడా తన బ్యాటింగ్తో అదరగొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీని ప్రపంచం క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా రికార్డుల రారాజు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటివరకు అతను సాధించిన రికార్డులు అలాంటివి. అయితే ఇటీవల రికార్డుల కింగ్ గా పేరు సంపాదించుకున్న కోహ్లీ మరో అరుదైన రికార్డును ఖాతాలో చేర్చుకున్నాడు.

 గత ఏడాది ప్రదర్శన ఆధారంగా ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మూడు ఫార్మాట్లలో కూడా టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 ను ప్రకటించింది. అయితే ఇక ఇటీవల icc ప్రకటించిన వన్డే జట్టులో చోటు సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యధిక సార్లు ఐసిసి జట్టులో స్థానం పొందిన భారత ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇప్పటివరకు కోహ్లీ 14 సార్లు ఐసిసి ప్రకటించిన జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇక రెండో స్థానంలో ధోని 13 ఉండగా తర్వాత రోహిత్ 8, సచిన్ 7, సెహ్వాగ్ 6, బుమ్రా 4, అశ్విన్ 4 ఉన్నారు అని చెప్పాలి. కాగా విరాట్ కోహ్లీ గత ఏడాది 24 వన్డే మ్యాచ్ లలో 72.47 తో  1377 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు 8 హాఫ్  సెంచరీలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: