కోహ్లీ ప్లేస్ లో.. జట్టులోకి ఎవరు రాబోతున్నారంటే?

praveen
టీమిండియా జట్టు ప్రస్తుతం వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీ బిజీగా ఉంది. ఈ క్రమం లోనే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో టి20 సిరీస్ ను ఘనంగా ముగించుకున్న టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది. రేపటి నుంచి ఇండియా వేదికగా ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ లో  మునిగి తేలుతూ చెమటోడుస్తున్నాయి..

 ఇలాంటి సమయం లో అటు టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ మాత్రం మొదటి రెండు టెస్టు మ్యాచ్లకు దూరమయ్యాడు అని చెప్పాలి. అయితే వ్యక్తిగత కారణాలతోనే అతను జట్టుకు దూరం గా ఉన్నాడు అన్నది తెలుస్తోంది.  మూడో టెస్ట్ మ్యాచ్ నుంచి అతను ఇక జట్టుకు అందుబాటులోకి రాబోతున్నాడు. అయితే కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ దూరమైన నేపథ్యంలో అతని స్థానంలో జట్టులోకి ఎవరిని తీసుకోబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. కాగా కోహ్లీ దూరమైన నేపథ్యంలో పలువురు ఆటగాళ్ల పేర్లు కూడా తెరమీదకి వచ్చాయి అని చెప్పాలి.

 కాగా మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లకు విరాట్ కోహ్లీ దూరం కావడంతో బిసిసిఐ మరో ప్లేయర్ని అతని స్థానంలో ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా రజాత్ పాటిదార్ ను విరాట్ కోహ్లీ ప్లేస్ జట్టులోకి తీసుకుందట బీసీసీఐ. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అని చెప్పాలి. కాగా రేపు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఇక రెండవ టెస్టు మ్యాచ్ విశాఖ వేదికగా జరగబోతుంది. అయితే ఒకవైపు ఇంగ్లాండ్ మరోవైపు ఇండియా రెండు కూడా అగ్రశ్రేణి టీమ్స్ కావడంతో హోరాహోరీ పోరు జరగడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: