ఇది కదా కావాల్సింది.. రోహిత్ కు ఐసీసీ అరుదైన గౌరవం?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సారధిగా ఎంత తోపు అన్న విషయాన్ని ఇప్పటికే నిరూపించాడు. ఏకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఐదు సార్లు టైటిల్ అందించాడు. అది కూడా అతి తక్కువ సమయంలోనే ఇలా ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలవడం గమనార్హం. అయితే ఇలా రోహిత్ గణాంకాలను చూసిన తర్వాతే బీసీసీఐ పెద్దలకు కూడా విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ చేతిలో సారధ్య బాధ్యతలు పెట్టారు. అయితే టీమిండియా కెప్టెన్ గా మరింత అత్యుత్తమ సారథ్యంతో అందరిని ఫిదా చేశాడు రోహిత్ శర్మ.

భారత కెప్టెన్గా రోహిత్ శర్మ సారధ్య  బాధ్యతలు చేపట్టాడో లేదో ఇక టీమిండియా విన్నింగ్ పర్సంటేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అని చెప్పాలి. మూడు ఫార్మట్లలో కూడా భారత జట్టును ఏకంగా అగ్రస్థానంలో నిలవడంలో రోహిత్ శర్మ సూపర్ సక్సెస్ అయ్యాడు. అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో జట్టును ఎంత సమర్ధవంతంగా ముందుకు నడిపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయింది అనే ఒక మాట తప్ప ఇక మిగతా టోర్నీ మొత్తం టీమిండియా రాణించినంత అద్భుతంగా ఏ టీమ్ కూడా రానించలేకపోయింది. అంతెందుకు ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా సైతం టీమిండియా ప్రదర్శన ముందు తేలిపోయింది.

 ఇలా తన కెప్టెన్సీ తో ప్రతిసారి కూడా అదరగొడుతూ వస్తున్న రోహిత్ శర్మ కు ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా ఒక అరుదైన గౌరవం ఇచ్చింది. 2023 ఏడాది ముగిసిన నేపథ్యంలో ఇక గత ఏడాదిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు అందరిని కూడా ఒక జట్టుగా చేసి ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ ను ప్రకటించింది. అయితే ఇక ఈ జట్టుకు ఐసిసి ఏకంగా రోహిత్ శర్మ ని కెప్టెన్ గారు నియమించడం గమనార్హం.అంతేకాదు జట్టులో ఇండియా నుంచి ఆరుగురు ప్లేయర్లకు చోటు దక్కింది. కెప్టెన్గా రోహిత్ శర్మ ఉండగా గిల్, కోహ్లీ, మహమ్మద్ షమి,మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లకు ఐసిసి మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్లో చోటు సంపాదించుకున్నారు. ఇలా రోహిత్ ని కెప్టెన్గా నియమించడంతో హిట్ మాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: