కేవలం బ్యాటర్ గానే కేఎల్ రాహుల్.. మరి వికెట్ కీపర్ ఎవరు?

praveen
గత కొంతకాలం నుంచి వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉన్న టీమ్ ఇండియా.  ఇక ఇప్పుడు ఏకంగా భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. దేశంలోని వివిధ వేదికలపై ఈ సిరీస్ జరగబోతుంది  అయితే ఇప్పటికే ఇంగ్లాండు ఆటగాళ్ళు భారత గడ్డ పై అడుగుపెట్టి ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు. అదే సమయంలో ఇక ఎటాకింగ్ గేమ్ తో ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తున్న ఇంగ్లాండును దెబ్బ కొట్టేందుకు టీమిండియా కూడా అటు పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకుంది అని చెప్పాలి.

 అయితే మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లకు అటు విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ కు వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి కాస్త రెస్ట్ ఇచ్చే అవకాశం ఉందని గత కొంతకాలం నుంచి ఒక చర్చ తెరమీదకి వచ్చింది. కేవలం స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా మాత్రమే అతను జట్టులో కొనసాగుతాడు అని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేశారు.

 ఈ క్రమంలోనే వికెట్ కీపింగ్ బాధ్యతలను ఇషాన్ కిషన్కు అప్పగిస్తారు అని వార్తలు వచ్చినప్పటికీ ఇక అతను జట్టుకు అందుబాటులో లేకపోవడంతో తెలుగు క్రికెటర్ కె ఎస్ భరత్ కు భారత జట్టులో చోటు తగ్గే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇదే విషయంపై కోచ్ రాహుల్ ద్రావిడ్ క్లారిటీ ఇచ్చాడు. గత నెలలో ప్రొటీస్ టీం తో జరిగిన టెస్టుల్లో వికెట్ కీపర్ గా సేవలందించిన కేఎల్ రాహుల్ ఇక ఇంగ్లాండ్తో సిరీస్ లో మాత్రం ఆ బాధ్యతలను దూరంగా ఉంటాడు అంటూ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. అతని కేవలం స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా మాత్రమే బరిలోకి దిగుతాడని తెలిపాడు. దీంతో ఇక తెలుగు ప్లేయర్ కేఎస్ భరత్  ను వికెట్ కీపర్ గా జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: