ఇండియాతో టెస్ట్ సిరీస్.. మా ప్లాన్ అదే అంటున్న ఇంగ్లాండ్ బౌలర్?

praveen
సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్టు ఫార్మాట్లో వరల్డ్ క్రికెట్లోనే అత్యుత్తమ టీమ్స్ కొనసాగుతున్న రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అంటే ఇక బంతికి బ్యాట్ కి మధ్య ఎంత హోరా హోలీ సమరం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి ఒక అత్యుత్తమ సమరానికి సమయం ఆసన్నమైంది. ఏకంగా ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రాగా.. భారత జట్టు ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేపటి నుంచి ఈ ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్ ప్రారంభం కాబోతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సర్కిల్లో ముందుకు సాగడానికి ఇరుజట్లకు కూడా ఈ సిరీస్ ఎంతో కీలకం కాబోతుంది.

 అయితే హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా అటు మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇరు జట్లు ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతాయి అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇదే విషయంపై ఒకవైపు ఇంగ్లాండ్ మరోవైపు భారత మాజీ ప్లేయర్లు కూడా స్పందిస్తూ ఎవరు ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగితే బాగుంటుంది అనే విషయంపై తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇలాంటి రివ్యూలు కాస్త తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న టీం ఇండియా కెప్టెన్ రోహిత్ ను ఇంగ్లాండ్ బౌలర్లు ఎలా ఎదుర్కొంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.

 కాగా ఇదే విషయం గురించి ఇంగ్లాండు జట్టు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా ఇండియాతో టెస్ట్ సిరీస్ కోసం తమ సన్నదత గురించి మాట్లాడాడు. కాస్త నెమ్మదిగా ఉండే ఇక్కడి పిచ్  లపై తగిన స్ట్రాటజీతోనే తాము బరిలోకి దిగుతాము అంటూ మార్క్ వుడ్ చెప్పుకొచ్చాడు. ఈ పిచ్ లపై మ్యాచ్ లలో భారత జట్టుతో పాటు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పై ఫైచేయి సాధించాలి అంటే ఖచ్చితమైన బౌన్సర్లు సందించాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఇండియాలో ఉండే స్పిన్ ఫిచ్ లపై అటు ఇంగ్లాండ్ బౌలర్లు తమ ఫాస్ట్ బౌలింగ్ తో ఎంతవరకు ప్రభావం చూపించగలరు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: