టీమిండియాకు షాక్.. స్టార్ ప్లేయర్ కు గాయం?

praveen
ప్రస్తుతం భారత జట్టు ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. గత కొంతకాలం నుంచి వరుసగా ద్వైపాక్షక సిరీస్ లు ఆడుతూ అదరగొడుతున్న టీమిండియా ఇక ఇప్పుడు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడబోతుంది. అయితే మొన్నటికి మొన్న సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ ను 1-1 తో సమం చేసిన టీమిండియా.. ఇక ఇప్పుడు సొంత గడ్డపై జరిగే టెస్టు సిరీస్ మాత్రం క్లీన్ స్వీప్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పాలి.  అయితే భారత జట్టు ఆటగాళ్లు అందరు కూడా ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉన్నారు.

 ఇకపోతే మొదటి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగబోతుంది. ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ విశాఖ వేదికగా జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. వ్యక్తిగత కారణాలతో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇకపోతే ఇప్పుడు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు ఒక బిగ్ షాక్ తగలపోతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల ప్రాక్టీస్ సెషన్ సమయంలో జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న శ్రేయస్ అయ్యర్ గాయం బారిన పడ్డాడు.

 నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతని మోచేయి కింది భాగంలో బంతి బలంగా తాగినట్లు సమాచారం. దీంతో అతను నొప్పితో విలవిలలాడిపోయాడట. ఇక వెంటనే అతను బ్యాటింగ్ చేయడం ఆపేసి మైదానాన్ని వీడినట్లు తెలుస్తుంది. అయితే ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంది అంటే రేపు ఇంగ్లాండుతో జరగబోయే తొలి టెస్ట్ కు అతను దూరమయ్యే అవకాశాలు ఉన్నాయ్. కాగా శ్రేయస్  గత కొంతకాలం నుంచి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తన ఇన్నింగ్స్ లతో జట్టు విజయాలలో కీలక పాత్ర వహిస్తున్నాడు. ఒకవేళ అతను మొదటి టెస్టు మ్యాచ్కు దూరమయ్యాడు అంటే అతని స్థానంలో ఎవరు టీంలోకి రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: