పాపం పాక్ క్రికెటర్లు.. ఒక్కరిని కూడా ఐసీసీ పట్టించుకోలేదు?

praveen
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లను మరింత ప్రోత్సహించేందుకు అవార్డులను ర్యాంకింగ్ లను ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐసిసి ర్యాంకింగ్స్ నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకోవాలని ఎంతో మంది ప్లేయర్లు ఆరాటపడుతూ ఉంటారు. అయితే తమకు ర్యాంకింగ్స్ తో సంబంధం లేదు అని బయటకు చెబుతున్నప్పటికీ లోలోపల మాత్రం ఐసిసి ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానంలో ఉంటే ఆ ఫీల్ వేరు అన్నట్లుగా భావిస్తూ ఉంటారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇక ఇలా మూడు ఫార్ముట్ లకు కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ప్రతి ఒక్క ప్లేయర్ భావిస్తూ ఉంటారు  అయితే కేవలం వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కాదు.. జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ కూడా సమిష్టిగా రానించి టీం ని కూడా అగ్రస్థానంలో నిలపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి భారత దాయాది దేశమైన పాకిస్తాన్ మాత్రం క్రికెట్లో అంతకంతకు వెనుకబడిపోతూనే ఉంది. వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్లలో ఒకటిగా కొనసాగుతున్న పాకిస్థాన్ ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు అని చెప్పాలి. దీంతో పాకిస్తాన్ జట్టుపై విమర్శలు వస్తున్నాయి.

 ఇకపోతే ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టి20, వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 ను ప్రకటించింది. అయితే ఇక ఈ మూడు ఫార్మట్లలో ఐసీసీ ప్రకటించిన జట్టు వివరాలలో పాకిస్తాన్ జట్టు నుంచి ఒక్క ఆటగాడికి కూడా చోటుదక్కకపోవడం గమనార్హం. ఇందుకు కారణం.. గత ఏడాది పాకిస్తాన్ ఫెలవ ప్రదర్శన చేయడమే అన్నది తెలుస్తోంది. అయితే బ్యాటర్లు ఇటు బౌలర్లు పూర్తిగా తేలిపోయారు.. ఎవరు ఓ మోస్తారుగా కూడా రాణించలేకపోయారు. ఇక మాజీ కెప్టెన్ బాబర్ అజాం పరిస్థితి మరీ ఘోరం అని చెప్పాలి. అతడి కెరీర్ లోనే గత ఏడాది ఒక బ్యాడ్ మెమరీగా మిగిలిపోయింది అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: