రూల్స్ ప్రకారం.. క్రికెట్ బ్యాట్ బరువు ఎంత ఉండాలో తెలుసా?

praveen
ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల ఆటలు ఉన్నప్పటికీ ఎందుకో క్రీడాభిమానులు అందరూ కూడా క్రికెట్ నే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఇక క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసి టీవీకి అతుక్కుపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  కొంత మంది క్రికెట్ ప్రేక్షకులు ఏకంగా స్టేడియంలో టికెట్లు కొనుగోలు చేసి మరి మ్యాచ్ చూడడానికి వెళుతూ ఉంటారు.

 అయితే ఇలా క్రికెట్ ని అమితంగా అభిమానించే ప్రేక్షకులు అందరూ కూడా ఇక క్రికెట్ ఆట గురించి తమకు అన్ని విషయాలు తెలుసు అని అనుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు ఎవరికి తెలియని విషయం ఏదైనా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అంటే అది చూసి మరి ఈ విషయాన్ని మేము ఎలా మరిచిపోయాం.. క్రికెట్ ను ఇన్ని రోజుల నుంచి చూస్తూ ఇక ఈ విషయం తెలియకుండానే ఉండిపోయామా అని అనుకుంటూ ఉంటారూ. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక విషయమే వైరల్ గా మారిపోయింది.

 సాధారణంగా క్రికెట్లో ఎంతోమంది బ్యాటర్లు వివిధ రకాల బ్రాండ్లు ఉన్న బ్యాట్లను పట్టుకుని బరిలోకి దిగుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా ఆటగాళ్లు వాడే బ్యాట్ విషయంలో కూడా నిబంధనలు ఉన్నాయట. కేవలం ఒక కిలో లేదంటే ఒకటిన్నర కిలో మాత్రమే ఆటగాళ్లు వాడే బ్యాట్లు ఉండాలట. అంతేకాకుండా ఒక క్రికెట్ బ్యాట్ 38 అంగుళాల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు. అలాగే వెడల్పు 4.25 అంగుళాలు.. ఇక అంచుల మందం 1.56 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు అన్న నిబంధన ఉందట. ఇక కొలతలపై ఉన్న పరిమితుల ఆధారంగానే క్రికెట్ బ్యాట్ 900 గ్రాముల నుంచి 1.6 కిలోల వరకు ఉంటుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: