జడేజాను ఊరిస్తున్న అరుదైన రికార్డు.. రెండు వికెట్లు తీశాడంటే?

praveen
ప్రస్తుతం టీం ఇండియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతూ ఉన్నాడు రవీంద్ర జడేజా. తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఏకంగా తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేయడమే కాదు.. ఇక బ్యాటింగ్ లో కూడా మెరుపులు మెరూపిస్తూ ఉంటాడు జడేజా. ఇక జడేజా క్రీజు లో ఉన్నాడు అంటే చాలు ఏదో ఒక మ్యాజిక్ చేసి జట్టును గెలిపిస్తాడు అన్న నమ్మకం భారత క్రికెట్ ప్రేక్షకులందరిలో ఉంటుంది. అంతలా తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.

 అయితే రవీంద్ర జడేజా లాంటి ఆల్ రౌండర్ తమ జట్టులో కూడా ఉంటే బాగుండు అని ఇతర టీమ్స్ అని కుళ్ళుకునే విధంగా అతని ప్రస్థానం కొనసాగుతూ ఉంది. బౌలింగ్లో బ్యాటింగ్లో మాత్రమే కాదు ఫీల్డింగ్  లో కూడా మైదానంలో పాదరసంలా కదులుతూ ఎన్నో విన్యాసాలు చేస్తూ ఉంటాడు రవీంద్ర జడేజా. ఇకపోతే ఇక భారత జట్టు ఇంగ్లాండ్ తో ఆడబోయే టెస్ట్ సిరీస్ కోసం కూడా అతను ఎంపిక అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కి ముందు రవీంద్ర జడేజాను ఒక అరుదైన రికార్డ్ ఊరిస్తుంది. కేవలం రెండు వికెట్లు తీశాడు అంటే చాలు ఒక అరుదైన రికార్డు సాధించబోతున్నాడు.

 ఆరుగురు భారత ఆటగాళ్లు సాధించిన ప్రత్యేక విజయాల జాబితాలో అతను కూడా చేరబోతున్నాడు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ టెస్ట్ లో జడేజా రెండు వికెట్లు సాధిస్తే ఏకంగా అంతర్జాతీయ క్రికెట్లో 550 వికెట్లు పూర్తి చేసుకుంటాడు అని చెప్పాలి. దీంతో ఈ ఘనత సాధించిన ఏడవ బౌలర్గా నిలుస్తాడు రవీంద్ర జడేజా. ఇప్పటివరకు అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఆర్ అశ్విన్, జవల్నాద్ శ్రీనాథ్ మాత్రమే ఈ రికార్డు సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: