సూపర్ సెంచరీ చేసి.. శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు?

praveen
ప్రస్తుతం దేశమంతా శ్రీరాముడి నామస్మరణతోనే మారుమోగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే 500 ఏళ్ల భారత హిందువుల కళ నెరవేరింది. ఏకంగా రామ జన్మభూమి అయిన అయోధ్యలో ఇటీవల రామ మందిర నిర్మాణం జరిగింది అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా అతిరథ మహారధుల మధ్య ఇటీవల ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అనే నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి.

 అయితే ఇక ప్రతి ఒక్క హిందువు కూడా రామనామం తలవకుండా ఉండలేకపోతున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది క్రీడా రాజకీయ సినీ రంగానికి చెందిన ప్రముఖులు అయోధ్య రామాలయానికి తమకు తోచిన విధంగా విరాళాలు అందజేశారు. అయితే ఇక్కడ ఒక క్రికెటర్ ఏకంగా తనకు ఇష్టమైన క్రికెట్లోనే ఒక అరుదైన రికార్డు సాధించి ఆ రికార్డును అయోధ్య రాముడికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు  ఇలా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో భక్తులందరూ కూడా తమదైన శైలిలో భక్తిని చాటుకుంటూ ఉన్నారు.

 ఇక అచ్చంగా ఇలాగే భారత ప్లేయర్ తెలుగు క్రికెటర్ కె ఎస్ భరత్ కూడా తన రామ భక్తిని చాటుకున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం ఇండియా ఏ జట్టు ఇంగ్లాండ్ లయన్స్ తో వరుసగా మ్యాచ్ లు ఆడుతూ ఉంది అన్న విషయం తెలిసిందే  ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ తో చెలరేగిపోయాడు తెలుగు క్రికెటర్ కె ఎస్ భరత్. ఇటీవల ఇంగ్లాండు లయన్స్ తో జరిగిన మ్యాచ్లో 116 పరుగులు చేశాడు అని చెప్పాలి. అయితే ఈ సెంచరీని శ్రీరాముడికి అంకితం ఇస్తున్నట్లు కే ఎస్ భరత్ ప్రకటించాడు. కాగా ఈ తెలుగు క్రికెటర్ అసమాన్యమైన పోరాటంతో ఓడిపోవాల్సిన మ్యాచ్ ను భారత జట్టు డ్రా గా ముగించుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: