టెస్ట్ క్రికెట్ బతకాలంటే.. అదొక్కటే మార్గం : ఇంగ్లాండ్ మాజీ

praveen
టెస్ట్ క్రికెట్ ను సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచు కుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక క్రికెట్ ప్రారంభమైంది అంటే అది సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్ తోనే. ఇక ఆ తర్వాత కాలంలో ప్రేక్షకులను అలరించడానికి వన్డే ఫార్మాట్ తో పాటు టి20 ఫార్మాట్ కూడా ప్రపంచ క్రికెట్లోకి వచ్చేసాయి. అయితే ఇక ఇటీవల కాలంలో ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి అంతకు అంతకు ఆదరణ పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా టి20 ఫార్మాట్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ను ఏలేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
 ప్రేక్షకులందరికీ కావాల్సిన బ్యాటింగ్ మెరుపులు బౌలింగ్ ఉరుములు అన్ని కూడా టి20 ఫార్మాట్ లో కనిపిస్తూ ఉండడంతో.. ఇక మిగతా ఫార్మాట్లను పట్టించుకోవడమే మానేశారు ప్రేక్షకులు. ఇక అప్పుడప్పుడు కనీసం వన్ డే ఫార్మాట్లో మ్యాచ్లను చూడటానికైనా ఇష్టపడుతున్నారు. కానీ ఏకంగా రోజుల తరబడి సాగే టెస్ట్ ఫార్మాట్లోని మ్యాచ్లను చూసేందుకు ఎవరు పెద్దగా ఆసక్తిని కనపరచడం లేదు. వెరసి ఇలా టెస్ట్ ఫార్మాట్ కి రోజురోజుకు ప్రేక్షకాదరణ తగ్గిపోతూనే ఉంది. దీంతో టెస్ట్ ఫార్మాట్ భవితవ్యం అటు ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

 అయితే ఇటీవల కాలంలో ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతోమంది మాజీ ఆటగాళ్లు టెస్ట్ ఫార్మాట్ ని కాపాడాలంటే ఏం చేయాలి అనే విషయంపై పలు సూచనలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ కూడా స్పందించాడు. ఒక ఏడాదిలో టెస్టుల కోసం ప్రత్యేకంగా మూడు నెలల సమయాన్ని కేటాయించాలి అంటూ మైకేల్ వాన్ సూచించాడు. మహిళలు పురుషుల క్రికెట్లో ఈ విధానాన్ని తీసుకురావాలి అంటూ చెప్పుకొచ్చాడు. అలా అయితేనే టెస్ట్ క్రికెట్ బతికే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక దీనికి అన్ని దేశాలను ఒప్పించాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు మైకల్ వాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: