టెస్ట్ సిరీస్ కి ముందు.. ఇంగ్లాండ్ జట్టుకు బిగ్ షాక్?

praveen
ప్రస్తుతం వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీ బిజీగా ఉన్న భారత జట్టు ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో పోటీ ఫార్మాట్లో సిరిస్ లు ఆడింది. ఈ క్రమంలోనే మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను 3-0 తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండు జట్టు భారత పర్యటనకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉన్నారు. దేశంలోని వివిధ వేదికలపై ఈ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగబోతుంది.

 హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉండగా అటు ఏపీలోని విశాఖ వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్ లో ముందుకు వెళ్లాలంటే అటు ఇంగ్లాండ్ జట్టుకు ఇటు భారత జట్టుకు కూడా ఈ టెస్ట్ సిరీస్ లో విజయం సాధించడం ఎంతో కీలకం అని చెప్పాలి  దీంతో పక్క ప్రణాళికలతో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాయి ఇరు జట్లు. ఇలాంటి సమయంలో ఇటీవల కీలకమైన ఆటగాడు దూరం అవడంతో ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పాలి. ప్రస్తుతం ఇంగ్లాండు టీం లో పవర్ హిట్టర్ గా కొనసాగుతున్న సార్ ప్లేయర్ హ్యారి బ్రూక్ జట్టుకు దూరమయ్యాడు.

 వ్యక్తిగత కారణాలతో ఇక అతను జట్టు నుంచి తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక అతని స్థానంలో డాన్ లారెన్స్ ను ఎంపిక చేసినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. బ్రూక్ జట్టులో లేకపోవడం ఇంగ్లాండుకు నిజంగా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే అతనికి టెస్ట్ ఫార్మాట్లో మంచి రికార్డులు ఉన్నాయి. 12 టెస్ట్ మ్యాచ్ లలో 62.17 యావరేజ్ 91.76 స్ట్రైక్ రేట్ తో 1181 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఏడు హాఫ్ సెంచరీలు ఉండడం గమనార్హం. అంతేకాకుండా ప్రస్తుతం మంచి ఫామ్ లో కొనసాగుతూ వున్నాడు బ్రూక్. ఇక అతను ఇలాంటి ప్లేయర్ దూరం అవడంతో ఇంగ్లాండ్ జట్టు వ్యూహాలు మొత్తం తారుమారు అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: