సానియా మీర్జా భర్త.. క్రికెట్లో అరుదైన రికార్డ్?

praveen
గత కొన్ని రోజుల నుంచి పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే అతను వార్తలు నిలవడానికి క్రికెట్ కారణం అనుకునేరు. ఏకంగా తన భార్య, ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ అయినా సానియా మీర్జాతో విడాకులు తీసుకోవడమే ఇందుకు కారణం. అయితే గత కొంతకాలం నుంచి వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఎక్కడ ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగిన కలిసి హాజరవుతున్నప్పటికీ ఎడమొహం పెడ మొహం అన్నట్లుగానే ఈ ఇద్దరు భార్య భర్తలు వ్యవహరించారు.

దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇటీవలే సానియా మీర్జా విడాకుల వార్తలు నిజమే అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఇక సానియా మీర్జా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిందో లేదో షోయబ్ మాలిక్ ఏకంగా తన రెండో భార్యతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇలా విడాకులు, రెండో పెళ్లితో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాడు ఈ పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్. అయితే ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి మాత్రం క్రికెట్ ఆటతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోవడం గమనార్హం.

 ఇటీవలే పాకిస్తాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. t20 ఫార్మాట్లో 13 వేలకు పైగా పరుగులు పూర్తి చేసిన తొలి ఏషియన్ ప్లేయర్గా నిలిచాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఈ మైలురాయిని అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో క్రిస్ గేల్ సరసన నిలిచాడు ఈ పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్. కాగా ఇప్పటికే వన్డేలు టేస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఆటగాడు టి20 ఫార్మాట్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఈ ఏడాది వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరగబోయే టి20 వరల్డ్ కప్ కి కూడా తాను అందుబాటులో ఉంటాను అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తెలిపాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: