నిజంగా ఇదో అద్భుతం.. ఒంటి చేత్తో ఎలా క్యాచ్ పెట్టాడో చూడండి?

praveen
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు ఇక మైదానంలో ఉండే ఆటగాళ్లు ఫీల్డింగ్ లో అద్భుతమైన విన్యాసాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నవారు ఎంతో ఎత్తు నుంచి వెళ్తున్న బంతిని గాల్లోకి ఎగిరి అసమాన్య రీతిలో క్యాచ్ పట్టుకోవడం చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏకంగా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి మరి ఏకంగా బంతిని ఆపి రన్స్ సేవ్ చేయాలని అనుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎవరైనా క్రికెట్ మ్యాచ్ లో మెరుపు ఫీల్డింగ్ తో అదరగొట్టారు అంటే అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది.

 ఇటీవల కాలంలో ఎంతోమంది ఆటగాళ్లు ఫీల్డింగ్ లో అసమాన్యమైన విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నారు. దీంతో స్టన్నింగ్ క్యాష్ లకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవల రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ, మధ్యప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది  అయితే ఈ మ్యాచ్ లో భాగంగా ఒక స్టన్నింగ్ క్యాచ్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఢిల్లీ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న వైభవ్ కంద్ పాల్ ని శరన్ష్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్ తో పేవిలియన్ పంపించాడు.

 44 ఓవర్లో రెండో బంతిని బ్యాటర్ బౌలర్ ఎండ్వైపు డిఫెన్స్ ఆడాడు. ఈ బంతి వేసిన తర్వాత బౌలర్ శరన్ష్ జైన్ తన కుడి వైపుకు మెరుపు వేగంతో డైవ్ చేస్తూ అద్భుతమైన రిటర్న్ క్యాచ్ అందుకున్నాడు. కేవలం ఒంటి చేత్తోనే ఈ క్యాచ్ ని అందుకోవడం గమనార్హం. ఇది చూసిన బ్యాట్స్మెన్ సైతం ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే శరన్ష్ క్యాచ్ పట్టిన వీడియో చూసి నేటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇతనికి బెస్ట్ ఫీల్డర్ అవార్డు ఇవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: