ఐపీఎల్ ఇండియాలోనే జరుగుతుందా.. బిసిసిఐ వైస్ ప్రెసిడెంట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
ఐపీఎల్ 17వ ఎడిషన్ ఎక్కడ నిర్వహిస్తారు అనే విషయంపై ఇప్పటికీ ఇండియాలో ఒక కన్ఫ్యూజన్ నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే కరోనా వైరస్ ప్రభావం తగ్గిన నాటి నుంచి కూడా ఇండియాలోనే ఐపిఎల్ టోర్నీ నిర్వహిస్తూ వస్తుంది బీసీసీఐ. కానీ ఇక ఈసారి నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మార్చ్ 22వ తారీఖు నుంచి ఐపీఎల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే అదే సమయంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు కూడా ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ లో జరిగే మ్యాచ్లకు సరైన భద్రత కల్పించలేము అని ఇప్పటికే బీసీసీఐకి అటు పోలీసుల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తుంది. దీంతో ఇక ఐపీఎల్ ని ఇండియా వేదిక గానే నిర్వహిస్తారా లేదంటే ఇక విదేశాలకు వేదికను మారుస్తారా అనే విషయంపై గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతూనే ఉంది. యూఏఈ లేదా శ్రీలంక వేదికలుగా ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించే అవకాశం ఉంది అని కొంతమంది క్రికెట్ విశేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

 ఇలా గత కొంతకాలం నుంచి ఐపీఎల్ వేదికపై జరుగుతున్న చర్చ గురించి బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేదిక మార్పు ఫై మేము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం భారత ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఐపీఎల్ భారత్ లోనే జరుగుతుందా లేదా విదేశాలకు షిఫ్ట్ అవుతుందా అనేది మాత్రం సెంట్రల్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ నిర్ణయించాల్సి ఉంది. అయితే ఏ విషయమైనా చర్చల తర్వాతే తెలుస్తుంది అంటూ రాజీవ్ శుక్ల క్లారిటీ ఇచ్చాడు. అయితే ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించేందుకు ఏదైనా వేదికలో ఇబ్బందులు ఉంటే ఆ వేదికను మరో మైదానంలోకి మార్చుతాం అని అటు గతంలో బీసీసీఐ పెద్దలు కూడా తెలిపారు అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: