రోహిత్ శర్మతో అంత ఈజీ ఏం కాదు.. ఇంగ్లాండ్ మాజీ షాకింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుతం భారత జట్టు వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ తో టి20 సిరీస్ ముగించుకుంది టీమిండియా. అయితే ఈ టి20 సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరికొన్ని రోజుల్లో టీమిండియా మరో కీలకమైన సిరీస్ ఆడబోతుంది. భారత పర్యటనకు రాబోతున్న ఇంగ్లాండు జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడబోతుంది అని చెప్పాలి.

 ఈ టెస్ట్ సిరీస్ అటు భారత జట్టుకు ఎంతో కీలకంగా మారుతుంది. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో టీమిండియా ముందుకు దూసుకుపోవాలి అంటే ఈ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టును ఓడించడం ఎంతో ముఖ్యం. అయితే బజ్ బాల్ అనే విధానంతో అటు టెస్ట్ ఫార్మాట్లో ఎటాకింగ్ గేమ్ ఆడుతుంది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టును అటు టీమిండియా ఎదుర్కోవడం కాస్త సవాలుతో కూడుకున్న పని. అయితే ప్రస్తుతం టీమిండియాలోని ఆటగాళ్ళు అందరూ కూడా ఫుల్ ఫామ్ లో ఉండడం భారత జట్టుకు కలిసి వచ్చే అంశం అని చెప్పాలి. ఇక రోహిత్ ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడు అన్న విషయం ఇటీవల సూపర్ సెంచరీతో అందరికీ అర్థమైంది.

 ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి ఇంగ్లాండు మాజీ స్పిన్నర్ మాన్టీ పనేసర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం చాలా కష్టం అంటూ పనేసర్ చెప్పుకొచ్చాడు. అతని దగ్గర ఎన్నో రకాల షాట్స్ ఉన్నాయి. అతని షాట్ సెలక్షన్ కూడా ఎంతో బాగుంటుంది. స్పిన్ పిచ్ లపై అటాకింగ్ చేసే సామర్థ్యం అతనికి ఉంది. దీంతో రోహిత్ అద్భుతమైన బ్యాటింగ్ ముందు ఇంగ్లాండ్ ఫేసర్లు వెనకడుగు వేసే అవకాశం ఉంది అంటూ ఆ జట్టు మాజీ స్పిన్నర్ మాంటి పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: