వరల్డ్ క్రికెట్ లో ఒకే ఒక్కడు.. రోహిత్ నిజంగా తోపే?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతటి విధ్వంసకరమైన బ్యాట్స్మెనో అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఏకంగా తన అద్భుతమైన ఆట తీరుతో భారత క్రికెట్ ప్రేక్షకులకే మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా హిట్ మాన్ గా మారిపోయాడు. అతను ఓపెనర్ గా బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు అంటే చాలు ఇక బౌలర్ల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే అతని బ్యాటింగ్ విధ్వంసం ముందు ఎక్కడ చెత్త రికార్డులు తమ ఖాతాలో చేరిపోతాయి అని.

 కాగా ఇప్పటివరకు భారత జట్టు తరుపున ఎన్నో అద్భుతమైన రికార్డులు కూడా కొల్లగొట్టాడు రోహిత్ శర్మ. అద్భుతమైన ఆట తీరుతో ఎప్పుడూ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూనే ఉంటాడు అనే విషయం తెలిసిందే. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో సెంచరీ తో చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా అంతకుముందు వరుసగా రెండు మ్యాచ్ లలో డక్ అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశ పరిచిన రోహిత్ మూడో మ్యాచ్లో మాత్రం దంచి కొట్టాడు. ఏకంగా 63 బంతుల్లోనే 121 పరుగులు చేసి బ్యాటింగ్ విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చేసి చూపించాడు రోహిత్.

 అయితే ఇలా మూడో టి20 మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేయడం ద్వారా ఎన్నో అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ సాధించిన ఒక్కో రికార్డు కూడా  తెరమీదకి వస్తూ ఉండడం గమనార్హం. అయితే రోహిత్ శర్మ ఖాతాలో ఇప్పుడు మరో రికార్డు చేరింది. అంతర్జాతీయ క్రికెట్లో 35 ఏళ్లు దాటిన తర్వాత అన్ని ఫార్మాట్లలో సెంచరీలు బాదిన మొదటి ప్లేయర్గా నిలిచాడు రోహిత్. టెస్టుల్లో గత ఏడాది జులైలో వన్డేలో అక్టోబర్లో ఇక టి20 ఫార్మాట్లో ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ పై మూడో టి20 మ్యాచ్లో సెంచరీలు చేశాడు రోహిత్ శర్మ. ఇప్పుడు వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఎవరూ కూడా 35 ఏళ్లు దాటిన తర్వాత మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేయలేకపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: